Pope Francis Apologises: పాఠశాలల్లో చిన్నారులపై వేధింపులు, మరణాలపై పోప్ క్షమాపణలు
Pope Francis Apologises: పోప్ ఫ్రాన్సిస్ కెనడాలోని స్థానిక జాతుల ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రెండు దశాబ్దాల నాటి రెసిడెన్షియల్ పాఠశాల హత్యల వ్యవహారంపై తాజాగా స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన కెనడా స్థానిక జాతుల ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చేశారు.
Pope Francis Apologises: పోప్ ఫ్రాన్సిస్ కెనడాలోని స్థానిక జాతుల ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రెండు దశాబ్దాల నాటి రెసిడెన్షియల్ పాఠశాల హత్యల వ్యవహారంపై తాజాగా స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన కెనడా స్థానిక జాతుల ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థను స్థానిక కెనడియన్ క్యాథలిక్ చర్చిలు దుర్వినియోగం చేయడంపై పోప్ క్షమాపణలు కోరారు. 2000 శతాబ్దం చివర్లో కెనడాలోని దాదాపు లక్షా 50 వేల మంది స్థానిక జాతులకు చెందిన పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేసి .. చర్చిలు నిర్వహించే పాఠశాలలకు బలవంతంగా పంపారు. అక్కడ పాఠశాలల్లో పిల్లలు శారీరక, లైంగిక వేదింపులకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇక్కడి విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే పిల్లలను మాతృభాషల్లో మాట్లాడనివ్వలేదనీ.. బలవంతంగా క్రైస్తవ మత ఆచారాలు పాటించేలా ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరిగింది. శారీరక , లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో వేలాది మంది మరణించడంతో వారిని చర్చిల పరిధిలోనే సమాధి చేశారు. పిల్లల మృతదేహాలు ఒక్కొక్కటి బయటపడటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. కానీ ఎంతమంది పిల్లలు మరణించారు ? ఎవరిని ఎక్కడ సమాధి చేశారన్న వివరాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెలియవు. ఇప్పటివరకు 4,117 పిల్లల మరణాలు నమోదు అయ్యాయి. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. దీనిపై స్పందించిన పోప్ (Pope Francis) బహిరంగ క్షమాపణలు తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణను కెనడా బిషప్‌లు స్వాగతించారు.
Also read : Brooklyn Subway Shooting: బ్రూక్లిన్‌లో కాల్పుల కలకలం.. రక్తసిక్తమైన సబ్‌వే స్టేషన్
Also read : Countries New Names: ప్రపంచంలోని ఆ దేశాల పాత లేదా కొత్త పేర్లు తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook