Minister Ktr Tour: దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ సమక్షంలో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా తెలంగాణకు మరో మణిహారం రాబోతోంది. రాష్ట్రంలో కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు  చేసేందుకు స్టాడ్లర్ రైలు ఆసక్తి చూపింది. ఇందులోభాగంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీనిపై స్టాడ్లర్ రైలు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్‌ గార్డ్ బ్రోక్‌ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ సంతకాలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరలో మేధో సర్వీస్‌ ప్రైవేట్ లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ కలిసి సంయుక్తగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని స్థాపించబోతున్నారు. ఒప్పందంలో భాగంగా రాబోయే రెండేళ్లల్లో తెలంగాణలో వేయి కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. ఫ్యాక్టరీలో తయారు చేసే రైల్వే కోచ్‌లను కేవలం భారత్‌లోనే కాకుండా ఏషియా పసిఫిక్ రీజియన్‌కు సైతం ఎగుమతి చేయనున్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తయారు అయ్యే వస్తువులు దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి కావడంపై హర్షం వ్యక్తం చేశారు. 


ఈపెట్టుబడి ద్వారా ప్రపంచ పెట్టుబడుదారులకు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణ ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. స్టాడ్లర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాకతో 2 వేల 500 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. తెలంగాణలో ఏర్పాటు కాబోతున్న తమ యూనిట్ కంపెనీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆ కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్‌ వెల్లడించారు. ఏషియా పసిఫిక్‌ ప్రాంతంలో తమ కంపెనీ మరింత అభివృద్ధి చెందేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకరాన్ని అభినందించారు.


Also read:Sharmila comment: ఓ దొర.. రైతుల వైపు చూడు.. కేసీఆర్‌పై షర్మిల మండిపాటు..!


Also read:LSG vs RCB Eliminator Playing XI: లక్నోతో బెంగళూరు ఢీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బౌలర్‌ దూరం! తుది జట్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి