Vijaya gadde: ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ నిషేధం వెనుక తెలుగు మహిళ
Vijaya gadde: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ నిషేధం వెనుక ఓ భారతీయ మహిళ ఉన్నారంటే నమ్ముతారా...నిజమే మరి..
Vijaya gadde: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ నిషేధం వెనుక ఓ భారతీయ మహిళ ఉన్నారంటే నమ్ముతారా...నిజమే మరి..
హింసను ప్రేరేపించే ట్వీట్లు, క్యాపిటల్ హిల్ ఘటన ( Capitol hill incident )పై ట్రంప్ మద్దతుదారుల దాడి ఘటన అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. అది ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ ( Ban on trump twitter account )పై పడిన శాశ్వత నిషేధం. ప్రపంచవ్యాప్తంగా ఈ నిషేధం సంచలనమైంది. నిషేధం వెలువడినప్పటి నుంచి ఓ భారతీయ మహిళ..అందులోనూ ఓ తెలుగు మహిళ చాలా ట్రెండ్ అవుతున్నారు. ఎందుకంటే ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ ( Twitter Account ) నిషేధం వెనుక ఉన్నది ఆ తెలుగు మహిళే. ఆమె పేరు విజయ గద్దె( Vijaya gadde ). 45 ఏళ్ల విజయ గద్దె పూర్వీకులు తెలుగువారే కావడం విశేషం.
విజయ గద్దె..ట్విట్టర్ సంస్థలో టాప్ పాలసీ మేకర్‌గా పనిచేస్తున్నారు. ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ ( Twitter legal policy and safety ) విభాగానికి ఈమెనే టీమ్ లీడర్. వాషింగ్టన్‌లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులను మరింత ప్రోత్సహించేలా డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) చేస్తోన్న పోస్టులు ఉన్నాయనే కారణంతో తొలుత 12 గంటల పాటు.. ఆ తరువాత శాశ్వతంగా ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధిస్తూ విజయ గద్దె కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
Also read: Indonesia flight crash: లభ్యమైన బ్లాక్‌బాక్సులు..అందులో ఏముంది ?
విజయ గద్దె నేపధ్యం
చిన్నారిగా ఉన్నప్పుడే విజయ గద్దె కుటుంబం అమెరికాకు వలస వచ్చి..టెక్సాస్ లోని బ్యూమౌంట్‌లో స్థిరపడింది. కార్నెల్ యూనివర్శిటీ, న్యూయార్క్ యూనివర్శిటీల్నించి లా చదివిన విజయ..2011లో ట్విట్టర్‌లో జాయినయ్యారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( America president elections ) ట్విట్టర్‌లో రాజకీయ ప్రకటనలు విక్రయించకూడదంటూ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని ఒప్పించడంలో విజయ పాత్ర కీలకమైంది.
Also read: Indian Army: చైనా సైనికుడిని అప్పగించిన భారత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook