Indonesia flight crash: లభ్యమైన బ్లాక్‌బాక్సులు..అందులో ఏముంది ?

Indonesia flight crash: ఇండోనేషియా విమాన ప్రమాదంలో అంతా విషాదమే. ఎవరూ బతికి బట్టకట్టిన పరిస్థితి కన్పించలేదు. కీలకమైన బ్లాక్‌బాక్సుల ఆచూకీ లభ్యమైంది. ఆ బ్లాక్‌బాక్సుల్లో ఏముంది.

Last Updated : Jan 10, 2021, 11:54 PM IST
  • ఇండోనేషియా విమాన ప్రమాదంలో ఎవరూ బతికిలేరని ధృవీకరించిన అధికారులు
  • విమాన ప్రమాదంలో కీలకమైన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యం
  • సిగ్నల్స్ ఆధారంగా వెలికితీసేందుకు ప్రయత్నాలు
Indonesia flight crash: లభ్యమైన బ్లాక్‌బాక్సులు..అందులో ఏముంది ?

Indonesia flight crash: ఇండోనేషియా విమాన ప్రమాదంలో అంతా విషాదమే. ఎవరూ బతికి బట్టకట్టిన పరిస్థితి కన్పించలేదు. కీలకమైన బ్లాక్‌బాక్సుల ఆచూకీ లభ్యమైంది. ఆ బ్లాక్‌బాక్సుల్లో ఏముంది..

ఇండోనేషియా ( Indonesia ) రాజధాని జకార్తా నుంచి టేకాఫ్ అయిన కాస్సేపటికే జావా సముద్రం ( Java sea ) లో కూలిపోయిన శ్రీ విజయ ఎయిర్‌లైన్స్ ( Sriwijaya airlines ) ‌కు చెందిన బోయింగ్ 737 ( Boeing 737 ) ప్రమాదంలో ఎవరూ బతికిలేరన్న విషయం అర్ధమౌతోంది.లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య విమాన భాగాలు, శకలాలు, మనుషుల శరీర భాగాలు, దుస్తులు ఒక్కొక్కటిగా లభ్యమవుతున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి..లభ్యమవుతున్నా శకలాలు, దుస్తుల్ని బట్టి ఎవరూ బతికిలేరని స్పష్టంగా తెలుస్తోంది. 

ప్రమాదం ఎలా జరిగింది..కచ్చితమైన కారణమేంటనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది. విమాన ప్రమాదం ( Flight crash ) లో కీలకంగా భావించే రెండు బ్లాక్‌బాక్సుల ( Black boxes ) ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్ ఆధారంగా వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానాన్ని నడిపిన పైలట్లు కూడా పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారేనని అధికారులు వెల్లడించారు. 

జనవరి 9వ తేదీ మద్యాహ్నం 2 గంటల 36 నిమిషాలకు జకార్తా ( Jakarta ) నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్స్ రాజధాని పొంటియానక్‌కు బయలుదేరింది బోయింగ్ 737 విమానం. ఇందులో 50 మంది ప్రయాణీకులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అందరూ ఇండోనేషియన్లే. బయలుదేరిన 4 నిమిషాలకే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీతో సంబంధాలు తెగిపోవడానికి ముందు విమానాన్ని 29 వేల అడుగులు ఎత్తుకు తీసుకువస్తానంటూ ఏటీసీ (ATC ) కు పైలట్ సమాచారాన్ని అందించాడు. తరువాత 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా సంబంధాలు తెగిపోవడం, సముద్రంలో కూలిపోవడం జరిగిందని ప్రాధమికంగా తెలుస్తోంది. బ్లాక్‌బాక్సుల్లో ఏముందే తెలిస్తే ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియనుంది. 

Also read: H1B Visa issue: భారతీయ ఐటీ నిపుణులకు బిడెన్ శుభవార్త, వీసా ఆంక్షలు తొలగింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News