జింహువా డాటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( Xinhua Data Information Technology )  అనే సంస్థ చైనాలోని షెంజెన్ ప్రావిన్స్ ( Shenzhen province )  లో ఉంది. ఈ సంస్థ చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ  కోసం గూఢచర్యం నిర్వహిస్తుంది. సోషల్ మీడియా ఇన్ పుట్స్ ఆధారంగా ఈ సంస్థ సుమారు 500 మిలియన్ల వార్తలు, 30 మిలియన్ల డాటా సేకరించింది. 



ప్రస్తుతం భారత్ చైనా మధ్య లఢఖ్ వద్ద యుద్ధ పరిస్థితి ఏర్పడింది. చైనా నిత్యం ఏదో ఒక కొత్త పన్నాగం పన్నుతోంది. అదే సమయంలో చైనా (China ) పాడు పనులు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కొన్ని సంస్థల సహకారంతో చైనా భారత్ పై గూఢచర్యలకు పాల్పడుతోంది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్మీ అధికారులు, వ్యాపారవేత్తలపై వీరు కన్నేసి ఉంచుతున్నారు.


చైనా యాప్స్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేస్తున్న సమయంలో ఈ సమాచారం షాకింగ్ కలిగిస్తుంది. కొన్ని పత్రికలు చైనాకు చెందిన జింహువా సంస్థ కొన్ని వేల భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోంది అని తెలిపాయి.



గూఢచార సంస్థ గురించి..
జింహువా డాటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఈ సంస్థ కార్యాలయం చైనాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి 20 డాటా సెంటర్లు ఉన్నాయి. మొత్తం 150 మిలియన్ల డాటాను ఇది నిత్యం సేకరిస్తోంది. సోషల్ మీడియా ఆధారంగా ఇది సమాచారాన్ని సేకరిస్తోంది.  సామాజిక మాధ్యమాలతో ఇది కోట్లాది వార్తలను ఇది విశ్లేషిస్తోంది. ఈ మిలియన్ల సమాచారంతో ఇది 30 మిలియన్ల డాటా ఇనపుట్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సంస్థ చైనాకు చెందిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం తరపున పని చేస్తోంది.


ఇక ఈ సంస్థ ఎలాంటి సమాచారం కోసం ప్రయత్నిస్తోందో తెలుసుకుందాం.



గూఢచారులు వెతికే సమాచారం ఇదే..
- వ్యక్తిగత సమాచారం
-  మిత్రుల గురించి సమాచారం.
- కుటుంబ సంబంధాల గురించి 
- మీరు ఇటీవలే తిరిని స్థలాల గురించి
- సోషల్ మీడియా సమాచారం 
-సోషల్ మీడియాలో కామెంట్స్, లైక్స్ 
- సోషల్ మీడియా పోస్ట్ లు


ఈ సంస్థ చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ చైనా పార్టీ తరపున సమాచారం సేకరిస్తోంది. సెలబ్రిటీలపై కూడా ఒక కన్నేసినట్టు సమాచారం. వారి కదలికలను రియల్ టైమ్ లో కలెక్ట్ చేస్తోందట.