Farmers Agaist Farm Bills 2020 | భారత దేశ  రాజధానిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. భారత ప్రభత్వం ఈ సంవత్సరం ప్రకటించిన అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం పై రైతులు ఆందోళన చేపట్టి వారు ఢిల్లీకి చేరుకున్నారు. దీనిపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వచ్చాయి. ప్రభుత్వం రైతు నాయకులతో సమావేశం అయి వారి ఆందోళనను ఆపే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!


కాగా ఢిల్లీలో రైతులు ప్రదర్శనలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. రైతులకు శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు ఉంది అన్నారు United Nations (UNO) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో. దీంతో అగ్రి చట్టాలకు (Farm Bills 2020) వ్యతిరేకంగా రైతులు హస్తిన వేదికగా చేస్తున్న ఆందోళనకు ఐరాస మద్దతు లభించింది.



Also Read | భారత్‌లో త్వరలో Pfizer Covid-19 Vaccine కానీ.. 


కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు రైతులకు ఉంది అని తెలిపారు ఆంటోనియో. దాంతో పాటు వారి ప్రదర్శనలకు అడ్డుతగలడం సరికాదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిథి స్టిఫఎన్ జూరిక్ పేర్కొన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook