గత ఎన్నికల కన్నా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 (US Election 2020) మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెట్టి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ (Joe Biden) ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 264 ఎలక్టోరల్‌ ఓట్లు జో బిడెన్‌కు లభించగా అధ్యక్షుడు ట్రంప్‌నకు 214 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికంగా ప్రకటనలకు ఖర్చు చేసిన అభ్యర్థిగా జో బిడెన్ రికార్డులు తిరగరాశారు. తాజాగా మరో రికార్డు దిశగా జో బిడెన్ సాగుతున్నారు 



 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరెన్నడు లేనంతగా భారీ ఓట్లను పొందిన అభ్యర్థిగా నిలిచారు. ఈ క్రమంలో ఇప్పటికే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రికార్డును అధిగమించారు. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామాకు 6 కోట్ల 98లక్షల ఓట్లు వచ్చాయి. అయితే తాజా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా జరుగుతుండగా బిడెన్ 7కోట్ల 19లక్షలకు పైగా ఓట్లు సాధించి ఒబామా అత్యధిక ఓట్ల రికార్డును బద్దలుకొట్టారు.



 


ఈ ఎన్నికల్లో గడిచిన వందేళ్లలోనే అత్యధిక పోలింగ్ నమోదైనట్లు తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు 7కోట్ల 19లక్షల ఎలక్టోరల్‌ ఓట్లు రాగా, అధ్యక్షుడు ట్రంప్‌‌ 6కోట్ల 85లక్షల ఓట్లతో ప్రస్తుతానికి వెనుకంజలో కొనసాగుతున్నారు. జో బిడెన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా అవతరించనున్నారని అమెరికా మీడియాతో పాటు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe