ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ ( Vaccine ) సిద్ధమవుతుందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president Donald trump ) కు షాక్ తగిలింది. టీకాను పరిశీలించకుండా ముందస్తు అనుమతి తీసుకోమని ఏకంగా 9 ఫార్మా కంపెనీలు నిర్ణయించుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నవంబర్  నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. ఎన్నికల్లో ప్రయోజనం కోసం అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా 9 ఫార్మా కంపెనీలు సేఫ్టీ ప్లెడ్జ్ ( 9 pharma companies safety pledge ) అంటే భద్రత ప్రతిజ్ఞపై సంతకం చేశాయి. ఈ 9 కంపెనీల్లో ఆస్ట్రాజెనెకా ( Astrazeneca ) , బయోన్టెక్ ( Biontech ), గ్లాక్సో స్మిత్ క్లైన్ పీఎల్ సీ ( Glaxo smithkline plc ) , జాన్సన్ అండ్ జాన్సన్ ( johnson and johnson ), మెర్క్ ( merck ), మోడెర్నా ( moderna ), నోవానాక్స్, ఫైజర్ ( pfizer ), సనోఫీ ఫార్మాలున్నాయి. సేఫ్టీ ప్లెడ్జ్ అంటే టీకాలు, ప్రజల భద్రత, శ్రేయస్సును పరిగణలో తీసుకోవడమే. టీకాను పరిశీలించకుండా ముందుస్తు అనుమతి తీసుకోమని 9 కంపెనీలు నిర్ణయించుకుని సంతకాలు చేశాయి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత టీకా భద్రత, సమర్ధతను ప్రదర్శించిన తరువాతే వీటి ఉత్పత్తికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామనేది సేఫ్టీ ప్లెడ్జ్‌ సారాంశంగా ఉంది. 


అంటే అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) ఆశలకు నీరుగారినట్టే. ఎందుకంటే ఈ మహమ్మారి పై పోరాడటానికి చికిత్స, వ్యాక్సిన్ కోసం డోనాల్డ్ ట్రంప్ త్వరితగతిన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే అక్టోబర్‌లోనే కొవిడ్ -19 ( Covid 19 vaccine ) కోసం వ్యాక్సిన్‌ను అమెరికా ఆమోదించవచ్చని ట్రంప్ అనుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ 9 ఫార్మా కంపెనీలు తీసుకున్న నిర్ణయం ట్రంప్ కు శరాఘాతమే మరి. Also read: US Election: నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రదిపాదన..ఎన్నికల ప్రచారాస్త్రమా ?