WHO: అలా చేస్తే వ్యాక్సిన్ వచ్చినా లాభం లేదు, మరింత ప్రమాదకరం
కరోనా వ్యాక్సిన్ ముందుగా ఎవరికి..ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఎవరికి వారు తమకే ముందుగా అందాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ వైఖరే ప్రమాదకరమంటోంది డబ్ల్యూహెచ్ వో. ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వైరస్ కట్టడి ఉంటుందంటోంది.
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) ముందుగా ఎవరికి..ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఎవరికి వారు తమకే ముందుగా అందాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ వైఖరే ప్రమాదకరమంటోంది డబ్ల్యూహెచ్ వో ( WHO ). ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వైరస్ కట్టడి ఉంటుందంటోంది.
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ( Vaccination ) పై ప్రపంచ ఆరోగ్ సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ ( WHO Chief Tedros Adhanom ) కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాల ఆలోచనావిధానం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అన్నారు. వ్యాక్సిన్ ముందుగా తమ ప్రజలకే అందించాలనే ఆలోచనతో కొన్ని దేశాలున్నాయని..ఇది ప్రమాదకర ధోరణి అంటున్నారు. ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల్లో వాక్సిన్‌ను ప్రభావంతంగా ఉపయోగించుకుంటేనే, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ఆయన తెలిపారు. కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడం కంటే , అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్ చేయడం ఉత్తమమనేది టెడ్రోస్ అథనామ్ అభిప్రాయం.
ప్రపంచంలో ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) అభివృద్దిలో నిమగ్నమై ఉన్నాయి. రష్యా ( Russia ) లో స్పుత్నిక్- వి వ్యాక్సిన్ ( Sputnik v vaccine ) విడుదల చేయగా, మరికొన్ని కంపెనీల వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials ) దశలో ఉన్నాయి. అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని త్వరలోనే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి, ప్రజలకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పేద దేశాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ దీనిపైనే దృష్టి పెట్టారు. తమ తమ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజం. అయితే ఈ జాతీయతా ధోరణి మంచిది కాదని టెడ్రోస్ అంటున్నారు. దీనివల్ల మహమ్మారి మరింతదా విజృంభించే అవకాశాలే ఉంటాయి తప్ప...నియంత్రించే అవకాశం ఉండదన్నారు. Also read: America: ఇండియాను మురికిగా వ్యాఖ్యానించిన ట్రంప్ పై దుమారం
ఎందుకంటే యూరప్ దేశాల్లో ప్రస్తుతం కరోనా కేసులు ( Corona cases in Europe countries ) మళ్లీ పెరుగుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల 65 వేల 319 కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఇందులో సగానికంటే ఎక్కువ యూరప్ దేశాల్నించే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రభావంతమైన వ్యాక్సిన్ విడుదలైతే, అన్ని దేశాల్లోనూ అది వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయని టెడ్రోస్ వివరించారు.వ్యాఖ్యానించారు.
సమకాలీన పరిస్థితుల్లో ఇదే అత్యంత తీవ్రమైన సంక్షోభమని..ప్రపంచమంతా అడుగడుగునా కలిసి నడుస్తూ, సుహృద్భావంతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లు, కరోనా పరీక్షలు, చికిత్సా విధానాలే ఇప్పుడు మన జీవితాన్ని కాపాడే మార్గాలని డబ్ల్యూహెచ్వో ఛీఫ్ టెడ్రోస్ చెప్పారు. శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 4,65,319 కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లండించింది. వీటిలో సగం కంటే ఎక్కువ కేసులు యూరప్ దేశాల్లో వెలుగుచూసినట్లు వెల్లడించింది. Also read: US Election: ట్రంప్ కరోనాను నిర్లక్ష్యం చేశారు