America: ఇండియాను మురికిగా వ్యాఖ్యానించిన ట్రంప్ పై దుమారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల రణరంగంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఇండియాపై విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. ఇండియాను మురికి గా అభివర్ణించడంపై దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Oct 25, 2020, 01:19 PM IST
America: ఇండియాను మురికిగా వ్యాఖ్యానించిన ట్రంప్ పై దుమారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ( America president Elections ) రణరంగంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump )..ఇండియాపై విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. ఇండియాను మురికి గా అభివర్ణించడంపై దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై జో బైడెన్ ( Joe Biden ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరొక్క వారం రోజుల వ్యవధిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. రిపబ్లికన్ పార్టీ ( Republican party ) అభ్యర్ధిగా మరోసారి పోటీలో ఉన్నారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇక డమోక్రటిక్ పార్టీ ( Democratic party ) అభ్యర్ధిగా జో బైడెన్.. ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారతదేశ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ( Kamala harris ) బరిలో ఉన్నారు. అమెరికాలో భారతీయుల ఓట్లు దాదాపు 20 లక్షల వరకూ ఉన్నాయి. అయినా ఎందుకో ట్రంప్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భారతదేశా్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాను మురికి ( Filthy ) గా అభివర్ణించారు. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై డమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో వాయుకాలుష్యం గురించి మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండియా ( India ) ను మీరు మురికిగా అభివర్ణించారు. మీరు మన స్నేహితులతో మాట్లాడే తీరు ఇది కాదు. వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించే మార్గం కూడా ఇది కాదని బైడెన్ ట్వీట్ చేశారు.

పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకోడానికి కార‌ణాలు వెల్లడించిన ట్రంప్‌.. త‌న నిర్ణయాన్ని స‌మ‌ర్థించుకున్నారు.  చైనా దేశాన్ని గ‌మ‌నించండి, ఎంత రోత‌గా ఉందో..  ర‌ష్యాను చూడండి, ఇండియాను చూడండి.. ఆ దేశాల్లో వాయు నాణ్యత చెడిపోయిన‌ట్లు ట్రంప్ ఆరోపించారు.

ఈ వ్యాఖ్యల్ని జో బైడెన్ సీరియస్ గా తీసుకున్నారు. తనతో పాటు కమలా హ్యారిస్  ఇండియాతో భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నామన్నారు. విలువ కోల్పోయిన అమెరికా విదేశాంగ విధానాన్ని తిరిగి గౌరవప్రద స్థానంలో ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఒబామా ( Obama ) ప్రభుత్వ హయాంలో కొనసాగిన ఇండియా అమెరికా సత్సంబంధాల్ని గుర్తు చేశారు. గతంలో ఒబామాతో కలిసి చేసినట్టే...ఈసారి కమలా హ్యారిస్ తో కలిసి మరింత ఎక్కువ భాగస్వామ్యంతో ఇరుదేశాల సంబంధాలను కొనసాగిస్తామని బైడెన్‌ తెలిపారు.

అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతూ..ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియాతో కలిసి పని చేస్తామని చెప్పారు. చైనా సహా మరే ఇతర దేశం బెదిరింపులకు దిగకుండా చేస్తామన్నారు. శాంతిని స్థాపిస్తామని తెలిపారు. Also read: US Election 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ రికార్డ్

Trending News