కరోనా వైరస్ ( corona virus )  మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా చికిత్స కోసం వివిధ రకాల మందుల్ని వివిధ సందర్భాల్లో వినియోగిస్తున్నారు. ఆయా సందర్బాల్లో వచ్చిన ఫలితాల్ని బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World health organisation) అనుమతించడమో లేదా నిరాకరించడమో చేస్తూ వస్తోంది. నిన్నటి వరకూ కరోనా చికిత్సలో ప్రాధాన్యత వహించిన ఆ ప్రత్యేక మందుల్ని ఇకపై నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. Also read: WHO: కరోనా ఔషధ ప్రయోగాలు త్వరలోనే: ప్రపంచ ఆరోగ్య సంస్థ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ 19 వైరస్ (Covid 19 virus ) కు ఇప్పటివరకూ నిర్ధారితమైన మందు ఇంకా అందుబాటులో రాలేదు. అందుకే దాదాపు అన్ని దేశాలు వ్యాక్సిన్ ( Vaccine)  కొనుగొనడంలో నిమగ్నమయ్యాయి. వ్యాక్సిన్ అందుబాటులో రావడానికి సమయం పట్టే అవకాశాలున్నందున తక్షణ చర్యగా వివిధ రకాల మందుల్ని ఉపయోగిస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని సత్ఫలితాలనిస్తుంటే...కొన్ని నిరాశ కల్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెమిడెసివర్ ( Remdesivir) , ఫావిపిరవిర్ ( Favipiravir ) , డెక్సామెథసోన్ ( Dexamethosone)  మందుల ఉపయోగానికి తాజాగా అనుమతులు లభించాయి. ఈ మందుల కంటే ముందు హైడ్రోక్సీ క్లోరోక్వీన్ ( Hydroxychloroquine) (HCQ) , హెచ్ ఐవీ ( HIV)  డ్రగ్స్ కు ప్రాచుర్యం లభించింది. ఎంతగా ఉంటే ఓ దశలో భారీగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇండియా నుంచి అమెరికా దిగుమతి కూడా చేసుకుంది. ఇప్పుడు పరిస్థితి మారింది. నిన్నటివరకూ ప్రాచుర్యంలో ఉన్న హైడ్రోక్సీ క్లోరోక్విన్, హెచ్ ఐవీ మందులు ఆశించిన ప్రయోజానాల్ని ఇవ్వడం లేదని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా చికిత్సలో వీటి ఉపయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. హెచ్ ఐవీ మందులుగా  వాడుకలో ఉన్న లోపినావిర్ ( lopinavir ) , రిటోనావిర్ (ritonavir)  మందుల్ని, హెచ్ సీ క్యూ మందుల ప్రయోగాల్ని నిలిపివేస్తున్నట్టు డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. ఈ ఔషధ ప్రయోగాలకు సంబంధించి వస్తున్న ఫలితాల్లో ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు...ముఖ్యంగా మరణాల రేటును ఈ మందులు ఏ మాత్రం తగ్గించలేదని తేలింది. ఈ నేపధ్యంలోనే వీటిపై ప్రయోగాల్ని ఇకపై నిలిపివేశారు. Also read: Delhi: ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం


ఇవి కాకుండా మిగిలిన మందులపై జరుగుతున్న ప్రయోగాలు కొనసాగనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.