coronavirus crisis: జెనీవా:  కరోనావైరస్ ( coronavirus ) మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియంత్రణలోకి రాలేదని.. ఇది మరింత ఉగ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల సంఖ్య గత ఆరు వారాల్లోనే రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం జరిగిన సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus) మాట్లాడుతూ.. ప్రపంచంలో చాలావరకు వైరస్ నియంత్రణలో లేదని, ఇది మరింత తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచంలోని కొన్ని సంపన్న దేశాల్లో  వైరస్ నియంత్రణకు ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడ్డాయని తెలిపారు. కొన్ని దేశాలు మాత్రమే ఇలా కరోనా కట్టడికి ముందుకుసాగుతున్నాయని, మరికొన్ని దేశాల్లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.  గత ఆరువారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయినట్లు మెట్రో న్యూస్ పేపర్ పేర్కొందని ఆయన తెలిపారు. Also read: Unknown Pneumonia: చైనా పొరుగు దేశాన్ని వణికిస్తున్న కొత్త వైరస్


కోటి 26లక్షలకు చేరుకున్న కేసులు.. 
ప్రపంచవ్యాప్తంగా శనివారం నాటికి కరోనావైరస్ కేసుల సంఖ్య  1,25,07,849కు పెరగగా..  మరణాలు సంఖ్య 56,0460కు చేరుకుందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. Also read: 
Covid19: వైరస్ పుట్టుపూర్వొత్తరాలపై డబ్ల్యూహెచ్ వో అధ్యయనానికి చైనా అంగీకారం
అమెరికాలో కొనసాగుతున్న వినాశనం..
ప్రపంచంలో అత్యధికంగా కరోనా వినాశనం కొనసాగుతున్న దేశాల్లో అమెరికా (USA) మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 31,82,385 కరోనా కేసులు నమోదు కాగా.. 1,34,073 మంది మరిణించారు. ఇదిలాఉంటే.. 18,00,827 కేసులు, 70,398 కరోనా మరణాలతో బ్రెజిల్ (Brazil) రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న భారతదేశంలో  (India) ఇప్పటివరకు 8,20,916 కేసులు నమోదు కాగా.. 22,123 మంది మరణించారు. Also read: 
Pulwama like attack: మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. రెక్కీ పూర్తి