Covid19: వైరస్ పుట్టుపూర్వొత్తరాలపై డబ్ల్యూహెచ్ వో అధ్యయనానికి చైనా అంగీకారం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ( Corona virus origin ) పుట్టుపూర్వోత్తరాల గురించి త్వరలో తెలియనుంది.  కరోనా వైరస్ ( Corona virus ) పై పరిశీలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ( WHO Team ) తమ దేశంలో వచ్చేందుకు చైనా అనుమతి తెలిపింది. చైనా విదేశాంగ శాఖ దీన్ని అధికారికంగా వెల్లడించింది.

Last Updated : Jul 8, 2020, 07:15 PM IST
Covid19: వైరస్ పుట్టుపూర్వొత్తరాలపై డబ్ల్యూహెచ్ వో  అధ్యయనానికి చైనా అంగీకారం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ( Corona virus origin ) పుట్టుపూర్వోత్తరాల గురించి త్వరలో తెలియనుంది.  కరోనా వైరస్ ( Corona virus ) పై పరిశీలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ( WHO Team ) తమ దేశంలో వచ్చేందుకు చైనా అనుమతి తెలిపింది. చైనా విదేశాంగ శాఖ దీన్ని అధికారికంగా వెల్లడించింది.

చైనా ( China ) లోని వుహాన్ నగరం ( Wuhan city ) లో కరోనా వైరస్ తొలి కేసు 2019, డిసెంబర్ 31న వెలుగుచూసింది. అప్పట్నించి క్రమ క్రమంగా కరోనా వైరస్ ముందు చైైనాను చుట్టుముట్టింది. అనంతరం అన్ని దేశాలకు విస్తరిస్తూ మహమ్మారిగా మారి మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రదేశాలు సైతం కరోనా వైరస్ బారిన పడటంతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రపంచంలోని అన్నిదేశాలు ఆర్ధికంగా చతికిలపడ్డాయి. ఈ నేపధ్యంలో భారత్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనాపై విమర్శలు చేయడం, చైనా అమెరికాను నిందించడం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ ను చైనా వైరస్ ( china virus ) గా, వుహాన్ వైరస్ ( Wuhan virus ) గా అమెరికా అభివర్ణించడం కూడా వివాదాలకు కారణమైంది. Also read: Covid19 virus: మరో 8 నెలల్లో 25 కోట్ల కరోనా కేసులు

ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం రంగంలో దిగిందనే చెప్పాలి. బహుశా ఇందులో భాగంగానే డబ్ల్యూహెచ్ వో ( WHO ) కు చెందిన టీమ్ కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై  అధ్యయనం చేసేందుకు రానుంది. డబ్ల్యూహెచ్ వో బృందాన్ని బీజింగ్ ( Beijing ) కు వచ్చేందుకు చైనా అనుమతిచ్చింది. చైనా విదేశాంగ శాఖ ( China Foreign Ministry ) అధికార ప్రతినిధి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ బృందం వుహాన్, తదితర ప్రాంతాల్లో పర్యటించి...కరోనా వైరస్ సంక్రమణ క్రమంపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది. వుహాన్ లో తొలికేసు ( First corona case ) నమోదు కాకముందు పరిస్థితి ఎలా ఉంది ? తొలి వ్యక్తికి సంక్రమణ ఎలా జరిగింది ? వంటి కీలక విషయాలపై సమచారాన్ని సేకరించనుంది. Also read: WHO: కోవిడ్ 19 వ్యాక్సీన్ అప్పుడే రాదు

జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ ( Johns Hopkins University ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1 కోటి 18 లక్షల 52 వేల 102 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 5 లక్షల 44 వేల 726 మంది మరణించారు. 

Trending News