woman gives birth to baby mid air in air india london cochin flight: లండన్‌ నుంచి కేరళలోని కోచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో (Air India flight) కొద్దిసేపు అందరూ ఉత్కంఠగా గడపాల్సి వచ్చింది. విమానంలోని ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ వేదన మొదలుకావడమే ఇందుకు కారణం. ఆ ఫ్లైట్‌లో 204 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు కూడా ఉన్నారు. దీంతో ప్రసవ వేదనతో ఇబ్బందిపడుతున్న మహిళకు వెంటనే వారు వైద్యం చేయడం మొదలుపెట్టారు. నెలలు నిండని ఆ ప్రసవం (delivery) సుఖాంతమైంది. పండంటి బాబు ఆమెకు జన్మించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Dussehra: దసరాకు 4 వేల ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు కాస్త అదనం, అందుకు కారణం అదే


అయితే ఆమెకు వైద్య పర్యవేక్షణ అవసరం కావడంతో మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో (frankfurt) అత్యవసరంగా విమానం ల్యాండ్ కావాల్సి వచ్చింది. తల్లీబిడ్డలను ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. వారికి తోడుగా మరో ప్యాసింజర్ కూడా ఉన్నారు. ఇక మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి కోచికి వెళ్లింది. ఆ ముగ్గురినీ ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి భారత్‌కు ఎయిర్‌‌ఇండియా (Air India) తీసుకురానున్నట్లు సమాచారం.


Also Read : RCB vs SRH Match Highlights: ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో RCB పై SunRisers Hyderabad విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి