ప్రపంచాన్ని గడగడ వణికిస్తూ..కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మరో వైరస్  కరోనా. ఇది చైనాలోని హూవాన్ సిటీలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ  వైరస్ ధాటికి 17 మంది మృతి చెందారు. మరో 440 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్. .  ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు.  చైనా నుంచి ఇతర దేశాలకు ఈ వైరస్ విస్తరించే అవకాశం ఉండడంతో అన్ని విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెల్త్ ఎమర్జెన్సీపై చర్చలు


గ్లోబల్ ఎమర్జెన్సీ విధించేందు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO చర్చలు ప్రారంభించింది. ఇవాళ జరిగిన చర్చలు రేపు కూడా కొనసాగనున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో రేపు  WHO అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాకు పలు విమానాల రాకపోకలు ఉన్నాయి. దీంతో ఈ వైరస్ హైదరాబాద్ లో వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ కూడా దాదాపు ఫ్లూ లాంటి లక్షణాలతోనే వస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. 


కరోనా వైరస్ సోకితే కనిపించే లక్షణాలు 
స్వైన్ ఫ్లూ లాగానే కరోనా వైరస్ గాలిలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా గాలిలో వైరస్ చేరి ఇతరులకు అంటుకుంటుంది.  దీని ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే దాదాపు స్వైన్ ఫ్లూ లో ఉండే లక్షణాలే ఉంటాయన్నమాట. వైరస్ సోకిన తర్వాత 10 రోజుల్లోగానే  ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ఇప్పటి వరకు యాంటీ రిట్రోవైరస్ మందులు గానీ , టీకాలు గానీ అందుబాటులో లేవు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..