WHO urges Men Over Monkeypox Spread: కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనే లేదు.. అప్పుడే మంకీపాక్స్ రూపంలో మరో కొత్త వ్యాధి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. కొద్ది నెలలుగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి ఇప్పటివరకూ 78 దేశాలకు పాకింది. ఈ దేశాల్లో ఇప్పటివరకూ 18 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులో యూరోప్‌లోనే నమోదయ్యాయి. అందులోనూ 90 శాతం కేసులు గే లేదా బైసెక్సువల్ పురుషుల్లోనే నమోదవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గే, బైసెక్సువల్ కమ్యూనిటీకి ఒక కీలక విజ్ఞప్తి చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గే, బైసెక్సువల్ కమ్యూనిటీకి చెందిన పురుషులు తమ లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ కోరింది. అలాగే, కొత్త వ్యక్తులతో లైంగిక సంబంధాలపై పునరాలోచించుకోవాలని కోరింది. ఆఫ్రికా వెలుపల నమోదైన మంకీ పాక్స్ కేసుల్లో 98 శాతం కేసులు గే, బైసెక్సువల్ సంబంధాలు కలిగిన పురుషుల్లోనే బయటపడ్డాయని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ బుధవారం (జూలై 27) ఒక ప్రకటన చేశారు.


మంకీపాక్స్ సోకినవారిలో ఇప్పటివరకూ ఐదుగురు మృత్యువాత పడినట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వెల్లడించారు. వ్యాధి బారినపడినవారిలో నొప్పి కారణంగా 10 శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని తెలిపారు. మంకీపాక్స్‌ను ప్రతీ ఒక్కరూ సీరియస్‌గా తీసుకుని.. తగిన చర్యలు తీసుకోగలిగితే వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమని అన్నారు.


కాగా, ఇటీవల ఇంగ్లాండ్ సైంటిస్టుల అధ్యయనంలోనూ గే లేదా బైసెక్సువల్ కమ్యూనిటీకి చెందిన పురుషుల్లోనే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. గత నెలలో ఇంగ్లాండ్‌లో ప్రచురితమైన ఓ మెడికల్ జర్నల్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. డబ్ల్యూహెచ్ఓ చేసిన తాజా ప్రకటనతో గే, బైసెక్సువల్ కమ్యూనిటీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 


Also Read: Apple Tea Benifits: అధిక బరువుతో బాధపడుతున్నారా.. 'యాపిల్ టీ'తో మీ సమస్యకు చెక్.. ఎలా తయారుచేసుకోవాలంటే..


Also Read: Big Relief To Telangana: బీజేపీతో కేసీఆర్ డీల్ కుదిరిందా? తెలంగాణకు రూ 10,200 కోట్ల రుణానికి ఓకే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి