Apple Tea Benifits: మారిన జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన పనులు చేసేవారు, శారీరక శ్రమ తక్కువగా ఉండే పనుల్లో ఉన్నవారు త్వరగా బరువు పెరుగుతున్నారు. ఒకసారి బరువు పెరిగాక తగ్గించుకునేందుకు వీరు చాలా కష్టపడుతారు. రకరకాల వర్కౌట్స్ చేయడం, ఇరుగు పొరుగు చెప్పే చిట్కాలు పాటించడం వంటివి చేస్తారు. అయినప్పటికీ ఫలితం కనిపించదు. ఇలా అధిక బరువుతో బాధపడుతూ వెయిట్ తగ్గాలనుకునేవారికి యాపిల్ టీ మంచి ఫలితాలనిస్తుందని చెబుతున్నారు.
యాపిల్ ఆరోగ్యానికి ఎంత మంచిదో.. యాపిల్ టీ బరువు తగ్గేందుకు అంత మంచిది. యాపిల్ టీ తయారీకి అవసరమయ్యే పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
కావాల్సిన పదార్థాలు :
యాపిల్ పండు - 1
మంచి నీరు - రెండు గ్లాసులు
దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూన్
నిమ్మరసం - ఒక టీస్పూన్
టీ బ్యాగ్ - 1
తయారీ విధానం :
ముందుగా రెండు గ్లాసుల నీటిని ఒక పాత్రలో పోసి స్టవ్‌పై మరిగించాలి. ఆ తర్వాత పాత్రను స్టవ్ పైనుంచి దింపి.. అందులో టీ బ్యాగ్ వేయాలి. ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని ఆ నీళ్లలో కలపాలి. ఇప్పుడు ఆ నీటిని మరోసారి మరిగించి కొన్ని యాపిల్ ముక్కలు వేయాలి. అనంతరం దాల్చిన చెక్క పొడి వేయాలి. ఒక 5 నిమిషాలు మరిగించాక.. పాత్రను స్టవ్ నుంచి దింపాలి. ఇప్పుడు ఆ నీటిని జల్లెడ ద్వారా వడగట్టి ఒక గ్లాసులో పోయాలి. అంతే.. యాపిల్ టీ రెడీ అయినట్లే. ఈ ద్రావణాన్ని రోజూ తీసుకుంటే అధిక బరువుతో బాధపడేవారికి చక్కని ఫలితం ఉంటుంది.
కేవలం అధిక బరువుతో బాధపడేవారికే కాదు, మలబద్దకం, అసిడిటీ, గ్యాస్, లూజ్ మోషన్స్‌కు కూడా ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో ఇది బాగా పనిచేస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.)
Also Read: Big Relief To Telangana: బీజేపీతో కేసీఆర్ డీల్ కుదిరిందా? తెలంగాణకు రూ 10,200 కోట్ల రుణానికి ఓకే..
Also Read : Covid 19 Vaccination: షాకింగ్... ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సినేషన్...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook