US President Elections: అగ్రరాజ్యంలో మహిళకు అధ్యక్ష పదవి అందని ద్రాక్షేనా..!
US President Elections Results 2024 : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రతి సారి జరిగిన ఎన్నికల్లో మగమహారాజులే అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టారు అక్కడ ప్రజలు. కానీ ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అధ్యక్ష పీఠంపై కూర్చోక పోవడం విశేషం.
US President Elections: అమెరికా అధ్యక్ష పదవి మహిళలకు అందని ద్రాక్షే అని చెప్పాలా..? వారికి ఇక అధ్యక్ష పీఠంపై కూర్చేనే అవకాశం లేదా.. మహిళలే మహిళా అధ్యక్షురాలికి అవకాశం ఇవ్వడం లేదా.. అంటే ఔననే చెప్పాలి. మొత్తంగా అక్కడ పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు మహిళలకు అధ్యక్ష పదవి వరించలేదు. అధ్యక్ష పదవి కోసం తలపడిన మహిళలకు ఆ గౌరవం మాత్రం దక్కలేదు.
అగ్రదేశంలో మహిళలలకు దక్కని ఆ గౌరవం ఇతర దేశాల్లో మాత్రం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ముందుగా శ్రీలంకలో సిరిమావు బండారు నాయకే ప్రపంచంలో తొలిసారి అధ్యక్షురాలిగా రికార్డు క్రియేట్ చేసారు. అదే భారత్ లో 60వ దశకంలోనే ప్రధాన పీఠం అధిరోహించారు. అటు ప్రతిభా పాటిల్, ప్రస్తుత అధ్యక్షరాలు ద్రౌపది ముర్ము వంటి వారు అధ్యక్షురాలైంది. అటు మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో షేక్ హసీనా, షేక్ ఖలిదా జియా వంటి వారు ప్రధాని పీఠం అధిరోహించారు. అటు పాకిస్థాన్ లో కూడా బేనజీర్ భుట్టో వంటి ప్రధాని పీఠం అధిరోహించారు. మొత్తంగా భారత్ తో పాటు అత్యంత దిక్కుమాలిన దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు మహిళలకు అత్యున్న పీఠాలపై కూర్చొబెట్టింది. కానీ అమెరికా మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా అమెరికా అధ్యక్ష పీఠంపై మహిళ
కానీ అగ్ర రాజ్యం అని చెప్పుకొనే అమెరికాలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. గతంలో హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవికి పోటీ పడినా ఆమెకు అవకాశం రాలేదు. తాజాగా భారతీయ అమెరికన్ కమలా హారిస్‌ను కూడా అమెరికన్లు పక్కన పెట్టేశారు. దాంతో అమెరికాకు మహిళా అధ్యక్షురాలు అన్నది కలగానే మిగిలిపోయింది. ఇక రాబోయే రోజుల్లో కూడా అమెరికాకు మహిళా అధ్యక్షురాలు అవుతారా లేదా అనేది వెయిట్ అండ్ సీ.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.