WHO: కోవిడ్ 19 వ్యాక్సీన్ అప్పుడే రాదు
కరోనా వైరస్ కు వ్యాక్సీన్ ఎప్పుడనే దానిపై భిన్నరకాల వాదనలు వస్తున్నాయి. కొందరు ఆగస్టు 15 అంటే..మరి కొందరు సెప్టెంబర్ నాటికంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా...అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ? వ్యాక్సిన్ ఎప్పటికి సాధ్యం? ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు ఏమంటున్నారు?
కరోనా వైరస్ కు వ్యాక్సీన్ ఎప్పుడనే దానిపై భిన్నరకాల వాదనలు వస్తున్నాయి. కొందరు ఆగస్టు 15 అంటే..మరి కొందరు సెప్టెంబర్ నాటికంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా...అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ? వ్యాక్సిన్ ఎప్పటికి సాధ్యం? ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు ఏమంటున్నారు?
కరోనా వైరస్ (Corona virus) మహమ్మారిని కట్టడి చేయడానికి పరిష్కారం ఒక్కటే. అదే వ్యాక్సిన్ (Vaccine). అందుకే భారతదేశంతో పాటు అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్ పరిశోధనల్లో ఉన్నాయి. ఒక్కో దేశం..ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన వాదన చేస్తోంది. కొందరు ఆగస్టు నాటికి సిద్ధమంటున్నారు. మరి కొందరు సెప్టెంబర్ నాటికి రెడీ అంటున్నారు. వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేది వ్యాక్సిన్ మాత్రమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే వ్యాక్సిన్ అందుబాటులో రావడమనే దాంట్లో చాలా దశలుంటాయి. అన్ని దశలు దాటితే గానీ వ్యాక్సిన్ కు అనుమతి లభించదు. ఈ నేపధ్యంలో అసలు కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus) కు పరిశోధన దశల్లో (Vaccine trials) ఉన్న వ్యాక్సీన్ లు ఎన్ని ఉన్నాయి? ఏ దశలో ఉన్నాయనేది తెలుసుకోవడం ముఖ్యం. Also read: Corona virus: వందమంది కొంపముంచిన ఆ ఒక్కడు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 150 వరకూ వ్యాక్సిన్ లు ప్రయోగదశలో ఉన్నాయి. వీటిలో భారతదేశం, ఫ్రాన్స్, జపాన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, జర్మనీ, బ్రిటన్, నైజీరియా వంటి దేశాలున్నాయి. వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనాలంటే క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials) అనేవి మూడు దశల్లో ఉండాలని..తొలి రెండు దశల్లో ప్రాధమిక పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని కానీ మూడో దశ అత్యంత కీలకం, కఠినమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సైంటిస్టు (WHO Chief Scientist) గా ఉన్న సౌమ్య స్వామినాధన్ ( Soumya Swaminathan) చెప్పడం ఇప్పుడు ఆసక్తి కల్గిస్తోంది. అటువంటప్పుడు ఇంకా తొలి రెండు దశల స్థాయిలోనే ఉన్న వివిధ దేశాల వ్యాక్సిన్ లు ఇప్పట్లో అందుబాటులో వచ్చే అవకాశాలు లేనేలేవు. ఎందుకంటే సౌమ్య స్వామినాధన్ చెప్పిన దాని ప్రకారం యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మినహా మిగిలినవన్నీ తొలి రెండు దశల్లోనే ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ (Oxford University) అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఒక్కటే మూడో దశలో ఉంది. ఏయే వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి..వాటి పని తీరు ఎలా ఉందనేదానిపై డబ్ల్యూహెచ్ వో నిపుణులు (WHO Experts) పరిశీలిస్తున్నారని సౌమ్య స్వామినాధన్ తెలిపారు. Also read: Corona medicine: కోవిడ్ 19 చికిత్సలో ఆ మందుల ప్రయోగాలు నిలిపివేత
మరోవైపు ఆగస్టు 15 నాటికి కోవ్యాక్జిన్ (Covaxin) అందుబాటులో వస్తుందన్న ఐసీఎంఆర్ (ICMR) ప్రకటనపై కూడా డబ్ల్యూహెచ్ వో (WHO) ఛీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాధన్ ( Chief Scientist Soumya Swaminathan) స్పందించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నీ పూర్తవడానికి 6-9 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు. అయితే ఐసీఎంఆర్ వాదన మరోలా ఉంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ (Pre clinical trials) ను విజయవంతంగా పూర్తిచేసుకున్నందునే తదుపరి అనుమతులిచ్చినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. అంతేకాకుండా దేశంలోని అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులో తీసుకురావడానికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రయోగాలు చేస్తున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. Also read: ICMR COVAXIN: కరోనా వ్యాక్సిన్‌పై స్పష్టత ఇచ్చిన ఐసీఎంఆర్
ఆ మందు ఎక్కువగా వాడితే నష్టమే:
ప్రస్తుతానికి కోవిడ్ 19 కు వ్యాక్సిన్ (Covid19 vaccine) లేనందున రెమిడెసివిర్ ( Remdesivir) వంటి మందులు ఉపయోగిస్తున్నామని..మరణాల్ని ఎంతవరకు ఈ మందు కట్టడి చేస్తుందనడంలో ఎటువంటి స్పష్టత లేదని కూడా సౌమ్య స్వామినాధన్ వెల్లడించారు. మరోవైపు ఫావిపిరవిర్ (Favipiravir) మందును ఎక్కువగా ఉపయోగిస్తే జనన లోపాలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు స్వామినాధన్.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..