సెక్యూరిటీ పరికరాల కుంభకోణంలో వేటుకు గురైన ఐపీఎస్ అధికారి ,ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను  ప్రభుత్వం పొడిగించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ( AB Venkateswara rao ) పై నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాల కేసు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇప్పుడా సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆగష్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది.


ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై హైకోర్టు ( High Court ) ను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే ద్రోన్ల కొనుగోలు కుంభకోణంలో కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని..కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇదివరకే స్పష్టం చేసింది.  మరోవైపు ఏపీ ప్రభుత్వం ( Ap Government ) హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టు ( Supreme court ) లో సవాలు చేసింది. దాంతో సుప్రీంకోర్టు హైకోర్టు స్టేను నిలిపివేసింది. 


చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు..దేశభద్రతకు ముప్పు వాటిల్లే ద్రోన్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. 


Also read: AP: జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణాలివే..రాత్రి పది గంటలకు అమిత్ షాతో భేటీ


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook