Stone Attack On CM YS Jagan In Vijayawada Publice Meeting: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ విజయవాడలో బస్సుయాత్రలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సింగ్ నగర్ లో ప్రాంతంలో.. ఎవరో ఆకతాయిలు ఆయనపై రాళ్లతో దాడికి దిగారు. వెంటనే ఆయన బాధతో విలవిల్లాడిపోయారు. వెంటనే బస్సుపై నుంచి దిగి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. రాయి గాయం నుదిటిపై బలంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా.. కుట్లు పడటానికి కూడా అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. బస్సు యాత్రకు కాస్తంత బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకొవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటనపై అనేక అనుమానాలు వస్తున్నాయని వైసీపీ శ్రేణులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Venu Swami Astrologer: వేణుస్వామి చనిపోవడంపై థంబ్ నెయిల్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్..


దాడి జరిగిన ప్రదేశంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, దాడి జరిగిన ప్రాంతంలో ఒకవైపు స్యూల్ భవనాలు, మరోవైపు ఇళ్ల భవనాలు ఉన్నాయి. పాఠశాల భవనంపై నుంచి రాయి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీ ఫుటెజీలను జల్లెడ పడుతున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే, టీడీపీ వర్గాలే రాయితో దాడి చేశారంటూ వైఎస్సార్సీపీ నేత పేర్నినాని అన్నారు. ఇదే ఘటనలో మంత్రి వెల్లంపల్లికి కూడా బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. 


ఇదిలా ఉండగా..మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ లో బస్సుమీదఅభివానం చేస్తుండగా.. ఒక్కసారిగా ఎవరో ఆకతాయిలు బలంగా ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా అది సీఎం జగన్ కు ఎడమ కంటికి బలంగా తాకింది. వెంటనే ఆయన నొప్పిని తాళలేక తన చేతితో పట్టకున్నారు. ఆయన పక్కనున్న వెల్లంపల్లికి కూడా మరో రాయి తగిలినట్లు తెలుస్తోంది.


Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..


వెంటనే సెక్యురిటీ సిబ్బంది సీఎం జగన్ ను బస్సులోపలికి చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించారు.  కాగా సీఎం జగన్ బస్సు యాత్ర నాలుగు గంటలుగా జరుగుతున్నట్లు తెలుస్తొంది. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే బొండా ఉమా, టీడీపీ కార్యలయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేవుడి చల్లని దీవెన, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంత కాలం ఎవరెన్ని కుట్రలు చేసిన కూడా సీఎం జగన్ కు ఏంకాదని, వైసీపీ నేతలు అంటున్నారు. అదే విధంగా..  మరోసారి వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలవడంఖాయమని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook