ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంవత్సరం ( Ap Academic year ) ఎట్టకేలకు ఖరారైంది. 2020-21 అకాడమిక్ ఇయర్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. మరోవైపు సెప్టెంబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రారంభిస్తామని మరోసారి స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి కారణంగా వాయిదా పడిన విద్యా సంవత్సరాన్నిప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో 2020-21 విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతున్నట్టు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ( Schools ) ప్రారంభిస్తామని మరోసారి చెప్పిన మంత్రి సురేశ్ ( Education minister Adimoolapu suresh )...అదే రోజు 43 లక్షల మంది విద్యార్ధులకు విద్యాకానుక అందిస్తామన్నారు. దీనికోసం 650 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గురువారం నాడు మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల ప్రారంభానికి ముందే..ఉపాధ్యాయుల బదిలీలుంటాయని..వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వీటిని నిర్వహిస్తామన్నారు. 


ఇక అక్టోబర్ 15 నుంచి జూనియర్ కళాశాలు ( Junior colleges ) ప్రారంభమవుతాయన్నారు. కళాశాలు ప్రారంభం కాగానే...విద్యాసంవత్సరపు చివరి సెమిస్టర్ పరీక్షల్ని నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ నెలాఖరుకు పరీక్షలు పూర్తవుతాయన్నారు. మరోవైపు అన్ని ప్రవేశ పరీక్షల్ని సెప్టెంబర్ 15 నుంచి 21 లోగా నిర్వహిస్తామన్నారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లా సెట్, ఎడ్ సెట్ అన్నింటినీ ఒకే వారంలో నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. Also read: AP 10th mark lists: పదో తరగతి మార్క్ లిస్ట్ ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి