పదవ తరగతి ( 10th class ) విద్యార్ధులకు శుభవార్త. మీ మార్క్ లిస్ట్ లు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ..ఎస్ ఎస్ సీ మెమోలను ( SSC Memo ) వెబ్ సైట్ లో ఉంచింది. ఇంకెందుకు ఆలస్యం..డౌన్ లోడ్ చేసుకోండిలా.
కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్ధులందర్నీ ఏపీ ప్రభుత్వం ( Ap Government ) పాస్ చేసింది. దీనికి సంబంధించిన పదో తరగతి మార్కుల జాబితాను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( Board of secondary education of andhra pradesh ) అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. పదోతరగతి విద్యార్దులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి తమ తమ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ముందు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసి.. హోమ్ పేజిలో మీకు కన్పించే SSC public examination March 2020 student results&short memo without photo అనే లింక్ పై క్లిక్ చేయాలి. దానిలో రోల్ నెంబర్ ఎంటర్ చేసి..సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే... స్క్రీన్ పై పదో తరగతి మార్క్ లిస్ట్ ( Mark list ) కన్పిస్తుంది. ఓసారి చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవడమే. దీనికి సంబంధించిన ఒరిజినల్ మెమోలను విద్యాశాఖ సంబంధిత స్కూళ్లకు పంపుతుంది. అక్కడి నుంచి విద్యార్ధులు ఒరిజినల్ మార్క్ లిస్ట్ ను తీసుకోవచ్చు. Also read: Vijayawada fire accident: పరారీలో ఇద్దరు యజమానులు