వ్యంగ్యాస్థాలు సంధించడంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Bjp president Somu Veerraju ) తరువాతే ఎవరైనా. ఏబీఎన్  రాధాకృష్ణను ఓ ఆటాడుకున్నారిప్పుడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఓ పత్రిక రాసిన వార్తలపై మండిపడిన సోము..రాధాకృష్ణ..తెలుగుదేశం పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) విషయంలో ఇటీవలి కాలంలో ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తున్న వార్తలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ ( Abn Radhakrishna ) వైఖరిని తప్పుబట్టారు. రాధాకృష్ణకు..చంద్రబాబు ( Chandrababu ) భాషకు అనుగుణంగా వార్తలు రాయాలనే ఆలోచన తప్పించి..పోలవరంపై ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Ap Bjp president somu veerraju ) విజయవాడలో మీడియాతో మాట్లాడారు.  భద్రాచలం సహా 10 మండలాలు గోదావరి జిల్లాల పరిధిలో వస్తాయన్నారు. పోలవరం ఎత్తుపై రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ys rajasekhar reddy )  ప్రారంభించారని..కేంద్ర ప్రభుత్వమే దీనిని పూర్తి చేస్తుందని సోము వీర్రాజు చెప్పారు. ప్రాజెక్టుపై అవగాహన లేని రాధాకృష్ణ..అర్ధరహితమైన రాతలు రాస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వమున్నప్పుడు ఇదే ప్రాజెక్టుపై ఒక్క వార్తైనా రాశారా అని ప్రశ్నించారు.


అటు వామపక్షాలపై కూడా సోము వీర్రాజు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వామక్షాలు చైనా వారని..ఇక్కడ తెలుగుదేశం పార్టీ ( Telugu Desam party ) కు ఏజెంట్లను ఆరోపించారు. చైనా డబ్బులిస్తే ఇండియాలో పనిచేస్తున్నట్టే..చంద్రన్న డబ్బులిస్తే ఇక్కడ రాష్ట్రంలో పని చేస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని కడిగిన ముత్యంలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.  దమ్ము ధైర్యముంటే..పోలవరంపై చర్చకు రావల్సిందిగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈ తరహా రాతలు రాసినందుకే చంద్రబాబుకు 23 ఇచ్చారని..ఇంకెన్ని తగ్గించాలనే ఈ ప్రయత్నాలంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. Also read: AP: విజయవాడ విమానాశ్రయంలో కొత్త రన్ వేకు డీజీసీఏ అనుమతి