Ap cabinet meet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు, ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం
Ap cabinet meet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యాన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం, ఈబీసీ నేస్తం పథకాలకు ఆమోదం తెలిపింది.
Ap cabinet meet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యాన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం, ఈబీసీ నేస్తం పథకాలకు ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలన్ని( Assembly budget session) దృష్టిలో ఉంచుకుని ఏపీ కేబినెట్ భేటీ అయింది. సచివాలయం మొదటి బ్లాక్ సమావేశమందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. మరోవైపు ఈబీసీ నేస్తం ( EBC Nestam scheme) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ మహిళలకు మూడేళ్లలో 45వేల ఆర్ధిక సాయం అందనుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తించనుంది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 3 వందల చదరపు అడుగుల లోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్( Ap cabinet ) నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ భేటీ సందర్బంగా స్థానిక ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో జరగనున్న అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ ( Ap cm ys jagan )మంత్రులకు వివరించారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎం మంత్రులను అభినందించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందని కేబినెట్ భావించింది.
Also read: Ap government: మంత్రి పెద్దిరెడ్డికి కీలక పదవి అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook