Ap government: మంత్రి పెద్దిరెడ్డికి కీలక పదవి అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Ap government: ఆంద్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయంలో కీలక పాత్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్దిదే అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని బహుమానంగా ఇచ్చారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 22, 2021, 07:18 PM IST
  • ఏపీ పంచాయితీ ఎన్నికల్లో విజయానికి మంత్రి పెద్దిరెడ్డికి బహుమానమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • సదరన్ జోన్ జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియామకం
  • ముఖ్యమంత్రి జగన్, గవర్నర్‌లకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి
Ap government: మంత్రి పెద్దిరెడ్డికి కీలక పదవి అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Ap government: ఆంద్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయంలో కీలకపాత్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్దిదే అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ కీలక పదవిని బహుమానంగా ఇచ్చారు.

ఉత్కంఠ రేపిన ఏపీ పంచాయితీ ఎన్నికలు( Panchayat elections ) ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  మద్దతుదారులు 80 శాతం పంచాయితీల్ని దక్కించుకుని విజయ దుందుభి ఎగురవేసింది. పంచాయితీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలవడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసింది. మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు గట్టి షాక్ ఎదురయ్యేలా ఫలితాలు వచ్చాయి. పంచాయితీ ఎన్నికల్లో విజయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )మంత్రి పెద్దిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. 

అంతేకాకుండా కీలకమైన పదవిని బహుకరించారు.పంచాయితీ ఎన్నికల్లో విజయానికి గుర్తుగా ఏపీ ప్రభుత్వం( Ap government ) తరపున కీలక పదవి అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister peddireddy ramachandra reddy )ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరన్ జోన్ జనరల్ కౌన్సిల్ (Southern zone general council member) సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు పంపగా..గవర్నర్ నామినేట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఈ కౌన్సిల్‌లో ప్రతి రాష్ట్రం నుంచి సభ్యులుంటారు. రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం నుంచి వస్తున్న నిధులు, డెవలప్‌మెంట్ వంటి అంశాలపై కౌన్సిల్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఏపీ ప్రభుత్వం తరపున తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, గవర్నర్‌కు పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

Also read: Kodali nani: చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపమని తమ్ముళ్లను కోరిన మంత్రి కొడాలి నాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News