అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహణపై స్పష్టత వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సోమవారమే (జనవరి 20న) ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే జనవరి 18న మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ఉందని జనవరి 17న మంత్రులు అధికారులకు సమాచారం అందింది. రాత్రయ్యే సరికి నిర్ణయం మారిపోయింది. సోమవారం ఉదయం 9గంటలకు కేబినెట్ భేటీ అని ఖరారుచేశారు. అయితే కేబినెట్ భేటీ తేదీపై తర్జభర్జన జరగడానికి కొన్ని కారణాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఏపీ సీఎంగా వైఎస్ భారతి : జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే వద్దని, మూడు రాజధానులు అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కానీ రాజధానుల నిర్ణయంపై సోమవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రివర్గం భావించింది. కానీ అదే రోజు ఉదయం ఏపీ కేబినెట్ బిల్లును ఆమోదించినా, గవర్నర్‌కు పంపి అనుమతి తీసుకుని సభలో ఉదయం 11 గంటలకు రాజధాని బిల్లు ప్రవేశపెట్టాలంటే అంత సులువుకాదని అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారమే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి బిల్లుపై మంత్రులు చర్చించాలనుకున్నారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్చించిన తర్వాతే కేబినెట్ ముందుకు బిల్లును తీసుకురావాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..