AP DSC 2008 : ఏపీలో డీఎస్సీ 2008 సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించనుంది. వివిధ కారణాల వల్ల అన్యాయమైన అభ్యర్ధులకు న్యాయం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీఎస్సీ 2008 అభ్యర్ధుల (DSC 2008) అంశం చాలాకాలంగా అపరిష్కృతంగా ఉంది. డీఎస్సీలో మెరిట్ పాటించకపోవడం వల్ల చాలామంది అభ్యర్ధులు నష్టపోయారు. ఈ అంశంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి సమస్యను విన్నవించారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్ధులకు కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా(Contract teachers) నియమిస్తామని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 193 మంది నిరుద్యోగ టీచర్లకు ఉద్యోగం లభించనుంది.ఇప్పటికే వీరిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఓట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని..వీరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం (Ap government) విడుదల చేసే నోటిఫికేషన్‌లో మినహాయించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. 


మరోవైపు గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు అక్టోబర్ 2వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తవుతుందని..వీరందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరగా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) సానుకూలంగా స్పందించారన్నారు. రెండేళ్లు నిండగానే శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.


Also read: Ramatheertham Temple: రామతీర్ధం ఆలయం వచ్చే ఏడాది ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook