Covid19: కాదంటే కఠిన చర్యలు: జగన్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కఠినంగా వ్యవహరించనున్నారు. కోవిడ్ 19 చర్యలపై అత్యవసర కేబినెట్ సమీక్ష ( Cabinet review meeting ) నిర్వహించారు. కరోనా వైద్యాన్ని నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కఠినంగా వ్యవహరించనున్నారు. కోవిడ్ 19 చర్యలపై అత్యవసర కేబినెట్ సమీక్ష ( Cabinet review meeting ) నిర్వహించారు. కరోనా వైద్యాన్ని నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం ( Ap Government ) మరింతగా అప్రమత్తమైంది. రానున్న కాలంలో తీసుకోవల్సిన చర్యలు, ఏర్పాట్లపై కేబినెట్ లో అత్యవసర సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైెఎస్ జగన్. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో వైఎస్ జగన్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైద్యాన్ని ఏ ప్రైవేటు ఆసుపత్రి కూడా నిరాకరించకూడదని...ఒకవేళ అలా చేస్తా అనుమతులు రద్దు చేస్తామంటూ జగన్ ( Ys jagan warning ) హెచ్చరించారు. కరోనా కారణంగా చనిపోయినవారి అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలని ఆదేశించారు. వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం శాశ్వత కేంద్రాలు ( Permanent covid19 test centres ) ఏర్పాటు చేయనున్నారు. Also read; Skill India: నైపుణ్యమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ
భవిష్యత్ అవసరాల కోసం పెద్దఎత్తున వైద్యుల్ని నియమించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 17 వేల మంది వైద్యులు, 12 వేల మంది నర్శుల నియామకానికి ప్రణాళిక సిద్ధమైంది. శాశ్వత కేంద్రాలు ఎక్కడున్నాయనే విషయాన్ని తెలిసే విధంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా క్వారంటైన్ కేంద్రాల్లో ( Quarantine Centres ) వసతులు, భోజనంపై వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికార్లను సూచించారు. Also read: Mumbai: వర్షాలతో ముంబై జలమయం, అతి భారీ వర్షాల హెచ్చరిక
ప్రభుత్వ సేవల్లో నాణ్యత ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలని కోరారు. నాణ్యత పాటించని అధికారులకు నోటీసులు పంపించాలని చెప్పారు. నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్ని ఆయా ప్రాంతాలకు పంపించి...ఇంటింటికీ కరోనా పరీిక్షల్ని వేగవంతం చేయాలని సూచించారు వైఎస్ జగన్. Also read: Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ?