AP Early Polls: ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకరోజు ఢిల్లీ పర్యటన అసాంతం బిజి బిజీగా క్షణం తీరికలేకుండా సాగింది. రాష్ట్ర ప్రయోజనాలు, నిధుల కోసమే పర్యటన అని చెబుతున్నా అసలు రహస్యం వేరే ఉందనే వాదన విన్పిస్తోంది. ప్రధాని మోదీతో ఏకంగా 80 నిమిషాల భేటీ అందుకేనని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటి వరకూ ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉన్నాయనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే ఇదంతా అవాస్తవమని ఐదేళ్లు పూర్తయిన తరువాతే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు పదే పదే స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు మరోసారి ఆ వాదన తెరపైకొచ్చింది. ఈసారి కచ్చితంగా ముందస్తు ఉంటుందనే ప్రచారం మొదలైంది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడపడంతో పాటు ఒకే రోజు హోంమంత్రి అమిత్ షా, ప్రదాని నరేంద్ర మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలవడంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. దీనికితోడు హోంమంత్రితో ఏకంగా 40 నిమిషాలు బేటీ కావడం, ప్రధాని నరేంద్ర మోదీతో 80 నిమిషాలు సమావేశం కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. 


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది. తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికలతో ఏపీ ఎన్నికలు జరిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరినట్టు సమాచారం. ముందస్తుకు వెళ్లడం ద్వారా ప్రయోజనం జరుగుతుందనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. అటు అభ్యర్ధుల ఎంపికను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో 18 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వమని పరోక్షంగా సంకేతాలివ్వడం వెనుక కారణమిదేనంటున్నారు. అంటే ఆ 18 మంది మినహా మిగిలిన సీట్లలో అభ్యర్ధులు దాదాపుగా ఖరారయ్యారా అనే సంకేతాలు వస్తున్నాయి. ఆ 18 మంది ఎమ్మెల్యేలకు కూడా పనితీరు మెరుగుపర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ వరకూ గడువు ఇవ్వడం మరో కారణం. 


అంటే సెప్టెంబర్ తరువాత అభ్యర్ధుల్ని ప్రకటించి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఆలోచన నిజమైతే త్వరలో ఏపీ అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలున్నాయి. ఇవాళ్టి ఢిల్లీ పర్యటనలో ఇదే విషయం చర్చించి..కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్టు తెలుస్తోంది. 


అయితే వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మాత్రం ఇవాళ మరోసారి ఈ విషయాన్ని ఖండించారు. ఐదేళ్ల పదవీకాలంలో ఒక్కరోజు కూడా వదులుకోమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారని తెలిపారు. 


అదే సమయంలో మరో వాదన కూడా విన్పిస్తోంది. దేశంలో జరగనున్న తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయా అనే ప్రచారం జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 


Also read: Ys jagan Delhi Tour: ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన, మోదీతో 80 నిమిషాల సమావేశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook