ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ( Heavy Rains ) , వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష ( Cm ys jagan review ) నిర్వహించారు. కృష్ణా నదికి ముంచుకొస్తున్న వరద నేపధ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు అప్రమత్తమవ్వాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తూర్పు బంగాళాఖాతంలో ( East Bay of Bengal ) ఏర్పడిన  వాయుగుండం ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటినా తెలంగాణ ( Telangana ) లో వర్షాలింకా తగ్గలేదు. ఆ కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ( Krishna River Flood ) కి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్‌ నీలంసాహ్ని కార్యక్రమంలో పాల్గొన్నారు.  ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. మరోవైపు వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. 


తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీ ( Prakasam barrage ) కి భారీ వరద వస్తోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదలయ్యాయి. మరో 24 గంటల్లో దీని ప్రభావం ఉండబోతోంది. ఈనేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ తెలిపారు. వేర్వేరు జిల్లాలలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని..జరిగిన నష్టం వివరాల్ని అంచనా వేయాలని కోరారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. కలుషిత నీరు లేకుండా మంచి తాగునీరు సరఫరా చేయాలని చెప్పారు. అంటవ్యాధులు ప్రబలంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. Also read: Watch Srisailam gates opened: నిండు కుండలా మారిన శ్రీశైలం.. 10 క్రస్ట్ గేట్ల ఎత్తివేత