YS Jagan Schedule: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. రాయలసీమ జిల్లాల్లోని కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమై..జనం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఏరియల్ సర్వే పూర్తి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..రెండ్రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు(Heavy Rains), వరదలకు పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. కొంతమంది గల్లంతయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలోని నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా సాగింది. వరద ప్రభావిత ప్రాంతాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఏరియల్ వ్యూలో సందర్శించారు. ఇప్పుడీ మూడు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైఎఎస్ జగన్ పర్యటన షెడ్యూల్(Ap cm ys jagan Tour Schedule) ఇలా ఉంది..


డిసెంబర్ 2 షెడ్యూల్


ఉదయం 9 గంటల 30 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం నుంచి కడపకు బయలుదేరుతారు.  పుల్లపొత్తూరు, ఎగుమందపల్లి ప్రాంతాల్ని సందర్శించి వరద బాథితులతో మాట్లాడతారు. ఆ తరువాత భారీ వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పరిసర గ్రామాల్లో వరద నష్టం, సహాయక చర్యలపై మాట్లాడతారు. మద్యాహ్నం  3 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేణిగుంట నుంచి వేదలచెరువు, యానాది కాలనీకు వెళ్లి..ప్రజలతో నేరుగా మాట్లాడతారు. పాపనాయుడుపేటలో వరద నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుని..వరద నష్టంపై బాధితులతో మాట్లాడతారు. సాయంత్రం తిరుపతిలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చిస్తారు. రాత్రికి తిరుపతిలోనే బస ఉంటారు. 


డిసెంబర్ 3 షెడ్యూల్


డిసెంబర్ 3వ తేదీ ఉదయం కూడా తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడతారు. ఉదయం 11 గంటలకు నేరుగా నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు రూరల్, దేవరపాలెంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శిస్తారు. నీట మునిగిన పంటపొలాల్ని పరిశీలిస్తారు. పెన్నానది వరద ప్రభావంతో దెబ్బతిన్న పంటల్ని పరిశీలిస్తారు. అక్కడ వైఎస్ జగన్ ( Ap cm ys jagan)రైతులతో నేరుగా మాట్లాడతారు. మద్యాహ్నం 1 గంటకు నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీకు చేరుకుని...వరద నష్టాన్ని వివరించే ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. అధికారులతో సమీక్ష అనంతరం తిరిగి అంటే మద్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని..అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. 


Also read: CM Jagan: సిరివెన్నెల కుటుంబానికి అండగా సీఎం జగన్-ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook