10th class exams | అమరావతి : ఏపీలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా వారిలో మానసిక స్థైర్యం నింపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ( Minister Adimulapu Suresh) అభిప్రాయపడ్డారు. 10 వ తరగతి పరీక్షలపై సోమవారం ఆయన అన్ని జిల్లాల విద్యా శాఖ ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్స్, పేరెంట్స్‌ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. కరోనావైరస్ ( Coronavirus) వేగంగా వ్యాపిస్తున్నందున పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులతో పాటు విధులకు హాజరయ్యే సిబ్బందికి ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్సింగ్ ( Social distancing) లక్ష్యం దెబ్బతినకుండా భౌతిక దూరం పాటించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు స్పష్టంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )


పదవ తరగతి పరీక్షా కేంద్రాల( SSC exam centres) వద్ద తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో తెలుసుకునేలా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మంత్రి సురేష్ సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.  Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు)


ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలో హై కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. విద్యార్థులు ఎస్ఎస్‌సి మార్కుల మెమోలు (SSC marks memos) ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించే ప్రక్రియలో నిమగ్నమైంది. త్వరలోనే పాఠశాలలకు సైతం ఈ మెమోలు అందనున్నాయి. పరీక్షలు రద్దు చేయడంతో ఇంటర్నల్ మార్క్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించనున్నట్టు ఎస్ఎస్‌సి బోర్డుకి సంబంధించిన ఉన్నతాధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..