10Th class exams: తెలంగాణ: పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా

TS 10th class exams 2020: హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని హై కోర్టు సూచించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated : Jun 6, 2020, 09:20 PM IST
10Th class exams: తెలంగాణ: పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా

TS 10th class exams 2020: హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 8వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కానీ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని హై కోర్టు సూచించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. హై కోర్టు తీర్పుపై పునరాలోచనలో పడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు వాయిదా వేయడానికే మొగ్గుచూపారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తామని సర్కారు చెప్పిన సందర్భంలో.. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో కరోనా విజృంభిస్తున్నందున అక్కడ పరీక్షలు వాయిదా వేసి మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా కోర్టు సూచించింది.అంతేకాకుండా ప్రతీ పది రోజులకు ఓసారి తాజా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కోర్టు స్పష్టంచేసింది. 

హైకోర్టు తీర్పు అనంతరం జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో మినహా రాష్ట్రంలోని అన్ని మిగతా ప్రాంతాల్లో పరీక్షలు జరుగుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ హై కోర్టు తీర్పుపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. తీర్పుపై చర్చించి అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేయాలనే నిర్ణయమే తీసుకున్నారు. 

తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో జూన్ 8 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టెన్త్ క్లాస్ పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. వీలైతే.. అంతా సజావుగా సాగితే రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8 నుంచి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని భావించిన సర్కారు.. హైకోర్టు తీర్పుకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల విద్యార్థుల కోసం మరోసారి పరీక్షలు నిర్వహించడం కుదరదనే ఉద్దేశంతోనే పరీక్షలు వాయిదా వేసేందుకే మొగ్గుచూపింది.

Trending News