ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ( Supreme court Chief justice SA Bobde ) కు లేఖ రాసినప్పటి నుంచీ ప్రతిపక్షనేత చంద్రబాబు అజ్ఞాతంలో వెళ్లారా..అవుననే అంటున్నారు వైసీపీ నేత ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. అజ్ఞాతంలో ఉండి ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో అంటూ సందేహం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ( Supreme court justice NV Ramana ) పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా అప్పట్నించే ప్రతిపక్ష నేత చంద్రబాబు ( Opposition leader Chandrababu naidu ) మౌనం దాల్చారు. ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ అంశంపై టీడీపీ నేతలు స్పందించినా చంద్రబాబు మాత్రం స్పందించలేదు. అంటే చంద్రబాబు అప్పట్నించి అజ్ఞాతంలో వెళ్లారని వస్తున్న అనుమానాలను సమర్ధిస్తున్నారు వైసీపీ నేత ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ( Government Chief Vip Srikanth reddy ). సీఎం జగన్ సీజేకు లేఖ రాసినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. అజ్ఞాతంలో ఉండి ఇంకెన్ని కుట్రలు చేస్తున్నారో అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి.


ఇక తన హయాంలో సీబీఐను రాష్ట్రంలో అనుమతించనని చెప్పి ప్రత్యేక జీవో సైతం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతి విషయానికి సీబీఐ విచారణ ( CBI Probe ) ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి. తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. అమరావతి అవినీతిపై చంద్రబాబుకు భయమెందుకని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. వేలాది కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని...ప్రభుత్వంపై ఎలా బురద చల్లాలా అనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. 


కరకట్టపై తన ఇంటిని ముంచేస్తున్నారని చంద్రబాబు అనడంపై శ్రీకాంత్ రెడ్డి వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. కరెంట్ ప్లగ్ లో చేయి పెడితే షాక్ కొట్టకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఓ రిజర్వాయర్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకుని ఉంటూ తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడం వల్లనే పలు ప్రాంతాలు నీట మునిగాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. 


రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ( Ysrcp government ) శత్రువుకు కూడా నష్టం చేకూర్చదని..అందరికీ ప్రయోజనం కల్గించడానికే ఆలోచిస్తుందని సమాధానమిచ్చారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ నేతలు, చంద్రబాబు చేస్తూ వచ్చిన పలు అంశాలకు ప్రభుత్వం తరపున దీటైన సమాధానమిచ్చారు శ్రీకాంత్ రెడ్డి. Also read: AP: దేశంలోనే తొలిసారిగా బీసీల కోసం 56 కార్పొరేషన్ల ఏర్పాటు