AP: దేశంలోనే తొలిసారిగా బీసీల కోసం 56 కార్పొరేషన్ల ఏర్పాటు

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున కార్పొరేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 18న బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైెరెక్టర్ల నియామకం జరగనుంది.

Last Updated : Oct 16, 2020, 03:32 PM IST
AP: దేశంలోనే తొలిసారిగా బీసీల కోసం 56 కార్పొరేషన్ల ఏర్పాటు

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున కార్పొరేషన్లు ( Corporations ) ఏర్పాటవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లను ( 56 BC Corporations ) ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 18న బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైెరెక్టర్ల నియామకం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra pradesh ) వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. వెనుక బడిన వర్గాల ప్రయోజనం కోసం పలు సంక్షేమ పధకాల్ని ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏకంగా 139 బీసీ కులాల కోసం కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ఏ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను బి కేటగిరీలో, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను సి కేటగిరీగా విభజించారు. ఈనెల 18 వతేదీన ఈ కార్పొరేషన్లకు ఛైర్మన్లు , డైరెక్టర్లను నియమించనున్నారు. ఒక్కసారిగా 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకమంటే...పెద్దఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలకు పదవులు వరించనున్నాయి.

బీసీ కులాల కార్పొరేషన్లతో  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా నేరుగా  లబ్దిదారులకు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్‌లోనూ 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని పేర్కొంది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.  

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party ) అధికారంలో వచ్చిన తరువాత ఏడాదిన్నర కాలంలో 2 కోట్ల 71 లక్షల 37 వేల 253 మంది బీసీలకు ప్రయోజనం చేకూరింది. బీసీల కోసం ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) 33 వేల 5 వందల కోట్లు ఖర్చు చేసింది. తాజాగా ఏర్పడిన కార్పొరేషన్ల ద్వారా భారీగా రాజకీయ పదవులు రానున్నాయి. Also read: Guntur: కాల్వలోకి దూసుకెళ్లిన ‌కారు.. న‌లుగురు తెలంగాణవాసులు మృతి

 

Trending News