AP: స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap Local Body Elections ) వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. స్థానిక సంస్థల్ని నిర్వహించాలని హైకోర్టు ( High Court ) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) లో పిటీషన్ వేసింది. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఉత్తర్వుల్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిలిపివేసింది. దాంతో ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు..ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.
హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా మరోసారి ఏపీ ప్రభుత్వం ( Ap Government ) సవాలు చేసింది. సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం వివరించింది.
Also read: AP: త్వరలో విశాఖ నుంచి వైఎస్ జగన్ పరిపాలన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook