AP: త్వరలో విశాఖ నుంచి వైఎస్ జగన్ పరిపాలన

ఎవరు అవునన్నా కాదన్నా..ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభం కానుందని మరోసారి స్పష్టమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Last Updated : Jan 21, 2021, 02:53 PM IST
AP: త్వరలో విశాఖ నుంచి వైఎస్ జగన్ పరిపాలన

ఎవరు అవునన్నా కాదన్నా..ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభం కానుందని మరోసారి స్పష్టమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీకు మూడు రాజధానుల్ని( Ap Three capitals )  ప్రకటించి సంచలనం రేపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ). ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం ( Executive capital visakhapatnam ), లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి ( Legislative capital Amaravati ), జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు ( Judicial capital kurnool ) నగరాల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతిలో ప్రతిపక్షాల తోడ్పాటుతో స్థానిక రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కోర్టులో విచారణ సాగుతోంది.

ఎన్ని అభ్యంతరాలున్నా..ఏమున్నా జగన్ ప్రభుత్వం ( Jagan Government ) మాత్రం మూడు రాజధానుల దిశగానే అడుగులు వేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణకే మొగ్గు చూపుతోంది. మూడు రాజధానుల నిర్ణయం ద్వారా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందులో భాగంగా విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఆచితూచి అడుగేయడమే కాకుండా..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. 

ఈ విషయమై ఇప్పటికే వైసీపీ కీలక నేతలు విశాఖకు సెక్రటేరియట్ ( Secretariat to visakhapatnam ) తరలింపు ఖాయమని స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు వేసినా విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలింపు ఆగదని మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల వాహనాల్ని ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్ ( Minister Avanti srinivas )..త్వరలో విశాఖపట్నం నుంచే జగన్ పరిపాలిస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం స్పష్టం చేశారు. ఏప్రిల్, మే నాటికి విశాఖకు సెక్రటేరియట్ తరలింపు ఖాయమని భావిస్తున్నారు. 

Also read: AP: ఇక ఇంటికే రేషన్ సరుకులు, డోర్ డెలివరీ వాహనాల్ని ప్రారంభించిన వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News