Supreme court: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ వైఫల్యం అంశంపై స్పందించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ హైకోర్టు ( Ap High court ) న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందిన జస్టిస్ రాకేశ్ కుమార్ ( Justice Rakesh kumar ) చేసిన తీవ్రమైన వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్( Mission Build Andhra pradesh ) కేసులో భాగంగా డిసెంబర్ 31న పదవీ విరమణకు ఒక్కరోజు ముందు కీలక వ్యాఖ్యలు చేసి వివాదం రేపారు. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో స్టే విధించడమే కాకుండా..రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని చెబుతూనే..ఈ అంశంపై తేలుస్తామని కూడా సవాలు విసిరారు. రాజ్యాంగం విఛ్చిన్నం జరిగిందంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు విస్మయం కల్గించాయి అందరికీ. ఈ వ్యాఖ్యలపై, హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం ( Ap government )సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ( Supreme court ) జస్టిస్ రాకేశ్ కుమార్ ఉత్తర్వులపై స్టే విధించింది. రాజ్యాంగ వైఫల్యంపై ఆర్టికల్ 356 ప్రకారం జోక్యం చేసుకోవల్సింది రాష్ట్రపతి అని..న్యాయస్థానాలు కాదని ప్రభుత్వం వాదించింది. హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని నివేదించింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే( Cji sa bobde )నేతృత్వంలోని ధర్మాసనం  కేసు పూర్వాపరాల్ని పరిశీలించింది. హైకోర్టు అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని గతంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. తమవారిని పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేస్తే..న్యాయస్థానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎక్కడైనా చూశామా అని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగవ్యవస్థలు కుప్పకూలిపోయాయని న్యాయమూర్తులు భావించేంతగా పరిస్థితి ఏముందో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది. 


Also read: Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook