AP Government: ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీఆర్వోల పదోన్నతులకు సంబంధించి గుడ్‌న్యూస్ అందించింది. వీర్వోలు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం విధి విధానాల్ని ఖరారు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం (Ap government) వీఆర్వోలకు గుడ్‌న్యూస్ అందించింది. పదోన్నతుల విషయంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరనుంది. గ్రేడ్ 1 వీఆర్వోలకు నేరుగా సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు విధివిధానాల్ని రూపొందించింది. డిగ్రీ విద్యార్ఙత కలిగి..ఐదేళ్లు గ్రేడ్ 1 వీఆర్వోగా పనిచేసుంటే..సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి కల్పిస్తారు. రెవిన్యూ శాఖలో పనిచేసే గ్రేడ్ 1 వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు అరవై నలభై నిష్పత్తిలో రొటేషన్ పద్ధతిలో పదోన్నతి ఉంటుంది.


దీనికోసం పదోన్నతి కలిగిన వీఆర్వోలు, ముందుగా సీనియర్ అసిస్టెంట్లుగా తహశిల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌లో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది.  ఈ రెండేళ్ల కాలంలో రెవిన్యూ ఇన్ స్పెక్టర్లుగా ఫీల్డ్ వర్క్‌కు వెళ్లకూడదు. పదోన్నతి కలిగిన తరువాత అన్ని శాఖల పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్(Ap public service commission) నిర్వహించే కంప్యూటర్, ఆటోమేషన్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రెండేళ్లకాలంలో ఈ ఆర్హతలు సాధించినవారికి రెగ్యులరైజ్ చేయడమే కాకుండా సీనియార్టీ కల్పించనున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం 1998 ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్‌ను ..జనరల్ అడ్మినిస్ట్రేషన్(General Administration) సవరించనుంది.


Also read: Vaccine Unit: ఏపీలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం త్వరలో ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook