Vaccine Unit: ఏపీలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం త్వరలో ప్రారంభం

Vaccine Unit: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం అందుబాటులో రానుంది. ప్రస్తుతం తొలిదశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. క్యాన్సర్, ఆర్ధరైటిస్, డయాబెటిస్ వ్యాధులపై పరిశోధనా కేంద్రం కూడా రానుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2021, 10:18 AM IST
Vaccine Unit: ఏపీలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం త్వరలో ప్రారంభం

Vaccine Unit: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం అందుబాటులో రానుంది. ప్రస్తుతం తొలిదశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. క్యాన్సర్, ఆర్ధరైటిస్, డయాబెటిస్ వ్యాధులపై పరిశోధనా కేంద్రం కూడా రానుంది.

ఏపీలో తొలి వ్యాక్సిన్ తయారీ యూనిట్ పనులు వేగంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా చిలమత్తూరు సమీపంలోని కోడూరు వద్ద భారీ ఫార్మా కంపెనీ పనులు జరుగుతున్నాయి. ఇండస్ జీన్ ఎక్స్‌ప్రెషన్స్ లిమిటెడ్ కంపెనీ 720 కోట్ల ఖర్చుతో బయో టెక్నాలజీ యూనిట్ నెలకొల్పుతుంది. మొత్తం 3 దశల్లో తలపెట్టిన పనుల్లో తొలిదశ పనుల్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Ap minister Goutham reddy) పరిశీలించారు. 220 కోట్ల ఖర్చుతో జరుగుతున్న తొలిదశ పనులు దాదాపు పూర్తయ్యాయి. క్యాన్సర్, ఆర్ధరైటిస్, డయాబెటిస్ వ్యాధులపై పరిశోధనా కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. ఇది రాష్ట్రంలో నెలకొల్పుతున్న తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రమని..రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) త్వరలో ప్రారంభిస్తారని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ యూనిట్ ద్వారా స్థానికంగా వేయిమంది బయో టెక్నాలజీ సైంటిస్టులు, బయో కెమిస్ట్రీ విద్యార్ధులకు అవకాశాలు లభిస్తాయని ఇండస్ జీన్ కంపెనీ తెలిపింది. మరో వేయిమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

Also read: CBI on Social Media: సోషల్ మీడియా పోస్టింగుల కేసులో సీబీఐకు కీలక ఆధారాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News