Ambati Rambabu: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్ని రద్దు చేస్తూ హైకోర్టు (Ap High Court) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఈ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లనుందని తెలుస్తోంది. సింగిల్ బెంచ్ తీర్పు ఫైనల్ కాద‌ని..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తీర్పు కాపీ వచ్చాక ఏం చేయాలనేది తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో ఇదే సింగిల్ బెంచ్ స్టే ఇస్తే..డివిజన్ బెంచ్ ఎన్నికల జరిపించిన విషయం తెలిసిందే. తీర్పు కాపీ వచ్చాక సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్నామని అంబటి రాంబాబు తెలిపారు.


రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల నిర్వహణ నిర్ణయం తప్పా కాదా అనే విషయం పక్కనబెడితే..ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాక ఏ న్యాయవ్యవస్థ కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు , హైకోర్టులు ఇచ్చిన అనేక తీర్పులున్నాయని గుర్తు చేశారు. ఒకవేళ డివిజన్ బెంచ్ తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు ( Supreme Court) వెళ్లే అకాశముందన్నారు. బెంచ్..బెంచ్‌కు మధ్య అభిప్రాయలు మారుతుండటం సహజమేనన్నారు. ఇక టీడీపీ, జనసేన పద్థతులు అంతేనని..మారరని ఎద్దేవా చేశారు. ఎన్నికలపై తుది తీర్పు ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు అంబటి రాంబాబు(Ambati Rambabu) చెప్పారు. 


Also read: Krishnapatnam medicine report: కృష్ణపట్నం మందులో పదార్ధాలు శాస్త్రీయమైనవే..ల్యాబ్ రిపోర్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook