Ap Government versus Nimmagadda: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా..ప్రభుత్వం ఆయనపై సీరియస్‌గా ఉందా. ఎన్నికల అనంతరం పరిస్థితి ఏంటి..నిమ్మగడ్డపై ప్రభుత్వం సీరియస్ అవడానికి కారణమేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ముందు స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local body elections ) వ్యవహారం. తరువాత పంచాయితీ ఎన్నికల ( Ap Panchayat Elections ) పేచీ. సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పు అనంతరం ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియకు అంగీకరించినా ఇరువురి మధ్య వివాదం ఆగడం లేదు. ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూనే పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్‌లపై సెన్సూర్ ఆర్డర్ పంపడం వివాదాస్పదమైంది. వాస్తవానికి ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ లేదా  సస్పెండ్ చేసే అధికారాలే ఎన్నికల కమీషనర్‌కు ఉన్నాయి. అంతేగానీ సెన్సూర్ ఆర్డర్ పంపుతూ సర్వీస్ రిజిస్టర్‌లో చేర్చమని డీవోపీటీకు రాసే హక్కు లేదు. ఫలానావ్యక్తులు  ఆఫీసర్లుగా పనికిరారని చెప్పడానికి ఎన్నికల కమీషనర్‌కు ఆ అధికారం లేదు. అందుకే ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంపించిన సెన్సూర్ ఆర్డర్ ప్రొసీడింగ్స్‌ ( Ap Sec proceedings ) ను వెనక్కి పంపింది. నిమ్మగడ్డ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని..ఆయన అహంభావంతో ఉన్నారని ప్రభుత్వం ( Ap Government ) ఆరోపించడానికి కారణాలివే. 


Also read: AP Panchayat Election 2021: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అర్హులు, అనర్హుల వివరాలు ఇవే


ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Ap Sec Nimmagadda Ramesh kumar ) పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy ) విమర్శించారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ సూత్రధారిగా మారారని..అధికారులపై దుందుడుకుగా దాడికి సిద్ధమయ్యారని..ఇది కచ్చితంగా ఫ్యాక్షన్ ధోరణేనని చెప్పారు. నిమ్మగడ్డ వ్యవహారశైలిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని స్పష్టం చేశారు. పరిధి దాటి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వమే ప్రొసీడింగ్స్ ఇస్తుంది. భవిష్యత్తులో నిమ్మగడ్డ ఇచ్చే ప్రొసీడింగ్స్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోదని చెప్పారు. కమీషన్ అనేది కేవలం సిఫార్సులు మాత్రమే చేయాలని..నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనన్నారు.  సస్పెండ్ చేసే అధికారం ఎన్నికల కమీషనర్‌ ( Election Commissioner ) కు కొద్దికాలమే ఉంటుందని..ప్రభుత్వం అధికార్లను రక్షిస్తుందని తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ జారీ చేసే అడ్డగోలు ఆదేశాలకు ఎవరూ భయపడవద్దని..అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని భరోసా ఇచ్చారు. 


గతంలో చంద్రబాబు నాయుడు ( Chandrababu ) ముఖ్యమంత్రి హోదాలో అప్పటి ఎన్నికల కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌లోకి వెళ్లి..ఎన్నికల కమీషన్ అంత పెద్దదనుకుంటున్నారా..అని తిట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడదే వ్యక్తి ఎన్నికల కమీషన్‌ను దూషిస్తారా అంటూ వేదాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ అధికారులపై దాడి చేయడం వెనుక కుట్ర దాగుందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 


Also read: AP SEC Proceedings: ఎన్నికల కమీషనర్‌కు ఆ అధికారం లేదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook