AP SEC Proceedings: ఎన్నికల కమీషనర్‌కు ఆ అధికారం లేదు

AP SEC Proceedings: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీకు చెందిన ఇద్దరు కీలక అధికార్లపై నిమ్మగడ్డ జారీ చేసిన సెన్సూర్ ఆర్డర్‌ను ప్రభుత్వం తిప్పి పంపింది. ఈసీకు ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.

Last Updated : Jan 27, 2021, 08:00 PM IST
AP SEC Proceedings: ఎన్నికల కమీషనర్‌కు ఆ అధికారం లేదు

AP SEC Proceedings: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీకు చెందిన ఇద్దరు కీలక అధికార్లపై నిమ్మగడ్డ జారీ చేసిన సెన్సూర్ ఆర్డర్‌ను ప్రభుత్వం తిప్పి పంపింది. ఈసీకు ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ‌లో పంచాయితీ ఎన్నికల ( Panchayat Elections ) ప్రక్రియ ప్రారంభమైంది. అధికార్లతో ఎన్నికల కమీషనర్ వీడియా కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఏకపక్ష చర్యల్ని మాత్రం ఇంకా మానలేదని తెలుస్తోంది. అధికార్ల వివరణ కోరకుండా..ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఇద్దరు కీలక అధికార్లపై సెన్సూర్ ఆర్డర్‌ను పంపించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh Kumar ). పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ( Gopalakrishna Dwivedi ), కమీషనర్ గిరిజా శంకర్ ( Girija Sankar )‌లపై సెన్సూర్ ఆర్డర్ అంటే క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన అభిశంసనను సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి పంపించారు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. 

అయితే ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) పంపిన సెన్సూర్ ఆర్డర్‌ను ప్రభుత్వం ( Ap Government ) వెనక్కి పంపింది. ఎన్నికల కమీషనర్‌కు ఆ అధికారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారుల వివరణ కోరకుండా ప్రొసీడింగ్స్ ( Sec Proceedings ) జారీ చేయలేరని..ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం కూడా లేదని తేల్చి చెప్పింది. అసలు అధికారుల వివరణే లేకుండా పెనాల్టీ ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించింది ప్రభుత్వం. ఇద్దరు సీనియర్ అధికార్లపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వాస్తవానికి పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరస్కరించారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వ ఛీప్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ( Adityanath Das ) ‌కు తెలిపారు. అనంతరం ఆ ఇద్దరు అధికార్లపై సెన్సూర్ పేరిట క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల్నే ప్రభుత్వం వెనక్కి పంపింది ( Ap Government reversed sec proceedings ). 

Also read: Local Body Elections issue: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నిమ్మగడ్డ, మరో వివాదమా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News