AP Roads: ఆంధ్రప్రదేశ్‌లో నరకప్రాయంగా మారిన రోడ్ల నుంచి త్వరలో విముక్తి కలగనుంది. రోడ్ల మరమ్మత్తు పనుల్ని యుద్ద ప్రాతిపదికన భారీ ఎత్తున చేపట్టనుంది ప్రభుత్వం. 2 వేల కోట్లతో మరమ్మత్తు పనుల కోసం టెండర్ నోటిఫికేషన్ వెలువడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో  భారీ వర్షాలు( Heavy Rains), తుపాన్ల కారణంగా రహదారులు బాగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిన పరిస్థితి. రోడ్ల దుస్థితి ( Damages Roads) కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో భారీ ఎత్తున రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో 7 వేల 969 కిలోమీటర్ల మేరక రోడ్లకు ప్రత్యేక మరమ్మత్తులు చేసేందుకు టెండర్ నోటిఫికేషన్ (Tender Notification) విడుదల చేయాలని ఆర్ అండ్ బీ శాఖను ప్రభుత్వం ( Ap government) ఆదేశించింది. కేవలం నెలరోజుల్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్ధలతో అగ్రిమెంట్లు పూర్తి చేయాల్లి ఉంటుంది.  2 వేల 205 కోట్లతో రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తు పనులకు ఇప్పటికే పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. గత యేడాది వేయి కోట్లతో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈసారి రెన్యువల్ లేయర్ వేసేందుకు  2 వేల 205 కోట్లు కేటాయించారు.  యుద్ధప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 


2 కోట్లలోపు పనులకు జిల్లా పరిధిలోనే ఆర్‌ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యాన టెండర్లు నిర్వహిస్తారు. 2 కోట్ల కంటే ఎక్కువుంటే రాష్ట్రస్థాయిలో టెండర్లు జరగనున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయి పనులకు రివర్స్ టెండర్లు జరుగుతాయి. ఏప్రిల్ నెలలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నారు.


Also read: Kodali nani: చంద్రబాబుపై మరోసారి విరుచుకపడ్డ మంత్రి కొడాలి నాని


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook