One District-One Airport: విమానయాన, నౌకా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వన్ డిస్ట్రిక్ట్- వన్ ఎయిర్‌పోర్ట్ కాన్సెప్ట్‌ను అందుబాటులో తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతిపెద్ద సముద్రతీరాన్ని కలిగిన రాష్ట్రంగానే కాకుండా విమానయాన సేవలు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు పేరుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మరో రెండు విమానాశ్రయాల నిర్మాణం పూర్తి కావల్సి ఉంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త విధానాన్ని  ఆలోచనను అందుబాటులో తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉండాలనేది మంచి ఆలోచన అని వైఎస్ జగన్ తెలిపారు. ఇందులో భాగంగానే వన్ డిస్ట్రిక్ట్- వన్ ఎయిర్‌పోర్ట్ (One District-One Airport) కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 


రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాల విస్తరణతో పాటు అన్ని జిల్లాల్లో ఏకరీతిన విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన మౌళిక సదుపాయుల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాల అభివృద్ధితో పాటు రెండు కొత్త విమానాశ్రయాలైన భోగాపురం, నెల్లూరు విమానాశ్రయాల పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) ఆదేశించారు. 


ఇక రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టుల్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లకు గానూ తొలిదశలో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి. రెండవ విడతలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా ఓడరేవు, కొత్తపట్నంలలో హార్బర్ల నిర్మాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం (Ap government) తలపెట్టిన కొత్త విమానాశ్రయాలు, హార్బర్లు, పోర్టుల నిర్మాణం పూర్తయితే..అత్యధికంగా విమానయాన, నౌకా సేవలున్న రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. 


Also read: AP Cabinet: పీఆర్సీ, కరోనా మహమ్మారి కీలకాంశాలపై కేబినెట్ భేటీ నేడే, మంత్రివర్గ మార్పుపై వార్తలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook