AP Governor: కరోనా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా పనిచేసింది. మౌళిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలివి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి దేశమంతటినీ విలవిల్లాడించింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)సృష్టంచిన విపత్కర పరిస్థితులు అసాధారణమైనవి. ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవవడంలో ఏపీ దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే సమర్ధవంతంగా పనిచేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే కితాబిచ్చింది. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్(Viswabhushan harichandan) ప్రశంసలు కురిపించారు.యుద్ద ప్రాతిపదికన ఆసుపత్రుల్లో బెడ్స్, మందులు, ఆక్సిజన్(Oxygen)వంటి మౌళిక సదుపాయాల్ని కల్పించిందని కీర్తించారు.రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్బంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఇతరులు రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో సమర్ధవంతంగా పనిచేశారన్నారు. 


రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకమయ్యే అవకాశం లభించిందన్నారు.సేంద్రీయ వ్యవసాయం, మొక్కల పెంపకం, రక్తదాన శిబిరాల వంటి ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా తీసుకొచ్చిన సంస్కరణల్ని ఏపీ ప్రభుత్వం(Ap government) సమర్ధవంతంగా అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. 


Also read: Godavari Floods: గోదావరికి వరద పోటు, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook