Medical Posts In Andhra Pradesh : ఏపీలో గత వారం రోజులుగా దాదాపు 10 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆసుపత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం వైద్య సిబ్బందిని త్వరగా నియమించి కోవిడ్19 మహమ్మారిని ఎదుర్కోవాలని భావిస్తోంది. ఈ మేరకు  మొత్తం 30,887 పోస్టుల భర్తీ చేపట్టేందుకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదివరకే 8,439 మంది డాక్టర్లు, నర్సులను నియమించగా, మిగిలిన పోస్టుల (AP Medical Posts) కోసం తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారితో పాటు ఏదైనా ఆరోగ్య విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్‌ నర్సులు, ట్రైనీ నర్సులు, పారిశుధ్య సిబ్బందిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?


కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. కోవిడ్19 ఆస్పత్రులలో అధిక మొత్తంలో బెడ్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...