AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోడ్ షోలు, బహిరంగ సభల్ని కట్టడి చేస్తూ ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను ఏపీ హైకోర్టు రద్దు చేసేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కల్గించేలా ఉన్నాయని ఏపీ న్యాయస్థానం అభిప్రాయపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కందుకూరు, గుంటూరులో జరిగిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. రాజకీయ సభల్లో ఇంతమంది మరణించడం ఆందోళన కల్గించింది. ఈ ఘటనలతో స్పందించిన ఏపీ ప్రభుత్వం రోడ్ షోలు బహిరంస సభల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం జాతీయ రహదారులు, మున్సిపల్, పంచాయితీ రోడ్లపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా సభలు నిర్వహించకూడదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకుంటే అభ్యంతరం ఉండదు. 


అయితే ఈ అంశాన్ని సవాలు చేస్తూ కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జనవరిలోనే ఈ అంశంపై వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చిందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఇప్పటికే సెక్షన్ 30 ప్రకారం పోలీసుల అనుమతితోనే సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపాయి. 2008లో ప్రజారాజ్యం పార్టీ సమావేశంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మరణిస్తే..అప్పటి ప్రభుత్వం సభలు సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలుండగా మళ్లీ కొత్తగా ఆంక్షలెందుకని పిటీషనర్లు ప్రశ్నించారు. 


అయితే పిటీషనర్ల వాదనల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ర్యాలీలు, సమావేశాలకు సంబంధించిన ఏ అంశంలోనూ నిషేధం లేదని సెక్షన్ 30 ప్రకారమే ఆదేశాలిచ్చామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్టీల ర్యాలీలు, సమావేశాలను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఈ అంశంపై హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ సోమయాజులుతో కూడిన ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జీవో నెంబర్ 1ను రద్దు చేసింది. రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులకు భంగమని వివరించింది.


Also read: Mudragada Entry: ముద్రగడ పయనం వైసీపీనే, ఎప్పుడు, ఎక్కడి నుంచి పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook