Pink Diamond: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మరోసారి తెరపైకి వచ్చింది. పింక్ డైమండ్ వ్యవహారంలో విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam ) లో పింక్ డైమండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీవారి పింక్‌ డైమండ్‌ ఉనికి విషయంలో తగిన విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు  తోసిపుచ్చింది. పింక్‌ డైమండ్ ( Pink Diamond )‌ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీలు రెండు నివేదికలు ఇచ్చాయని.. అందువల్ల దీనిపై మళ్లీ విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. 


హైకోర్టు ( High Court ) ఛీఫ్ జస్టిస్ అరుప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్‌ పిల్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపీ విజయ సాయిరెడ్డి, అప్పటి ఈవోలు ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. అయితే సాయిరెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది.  


Also read: Tirumala: టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook